Bengaluru: బధిర చిన్నారిని నాలుగో అంతస్తు నుంచి విసిరేసిన తల్లి!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఎస్‌ఆర్‌ నగర్‌లో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. అనంతరం ఆమె సైతం రెయిలింగ్‌ పైకి ఎక్కి కొద్ది సేపు అలాగే నిలబడింది. అది చూసి అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి ఆమెను వెనక్కి లాగారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. బాలిక బధిరురాలని.. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. నిందితురాలు దంత వైద్యురాలు కాగా.. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. ‘అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. తల్లి మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆరా తీస్తున్నాం’ అని సీనియర్ పోలీసు అధికారి శ్రీనివాస్ గౌడ తెలిపారు.



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని