Diabetics : మధుమేహుల అల్పాహారం ఇదీ...!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధుమేహం వచ్చిందని ఆహారం తినడం మానేయొద్దు.. దాన్ని అదుపులో పెట్టుకోవడానికి చక్కని మార్గాలెన్నో ఉన్నాయి. మందులు, శారీరక వ్యాయామమే కాదు..ఉదయపు అల్పాహారంలో మార్పులు చేసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశాలెన్నో ఉన్నాయి.

ఇలా చేసి చూడండి

* అల్పాహారం మార్పులు చేసుకోవడంతో గ్లూకోజ్‌ను చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. 

* ఉదయపు అల్పాహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తాజాపండ్లు, ముడి ధాన్యాలు, కొవ్వులేని మాంసం, చేపలు, పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

* ఏ పదార్థం తయారు చేసుకున్నా కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇడ్లీ సాధారణంగా తినే బదులు అందులో క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌ తురుము వేసుకోవాలి.

* ఏదో ఒకరకం పప్పుతో కాకుండా రకరకాల పప్పులను కలిపి వండుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 

* మినప గారెలకు బదులు రకరకాల పప్పులు కలిపి వడలుగా చేసుకోవాలి. క్యారెట్‌, పాలకూర వేస్తే మరీ బాగుంటుంది.

* చపాతీ పుల్కా వంటివి చేసుకుంటే గోధుమ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్‌ గోధుమపిండిని వినియోగించాలి. 

* పూరీలకు బదులు చపాతీలు, దానిలో మెంతుకూర వేసుకుని తింటే మంచిది. పాలకూర కూడా బాగుంటుంది.

* తెల్ల బ్రెడ్‌ కాకుండా బ్రౌన్‌ బ్రెడ్‌ను గుడ్డుతో కలిపి తీసుకోవాలి.

* మాంసం ఫ్రై కాకుండా కూరలా వండుకొని కాస్తంత తినొచ్చు. 

* ఒకే రకం నూనెలకు బదులుగా రెండు, మూడురకాల నూనెలున్న బ్లెండెడ్‌ ఆయిల్‌ వాడాలి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని