National News: హెచ్‌ఐవీ బాధితుడి రక్తాన్ని ఎక్కించుకున్న ప్రేయసి!

స్సాంలో కావాలని ఓ యువతి హెచ్‌ఐవీ బాధితుడి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన వెనుక ఓ ‘ప్రేమకథ’ ఉంది. అసలేం జరిగిందంటే.. కామ్‌రూప్‌ జిల్లాలోని సువల్‌కచిలో నివాసం ఉంటున్న ఆ యువతి (19)కి.. పొరుగు గ్రామానికి చెందిన ఓ యువకుడితో మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. ఒకరినొకరు విడిచి ఉండలేని స్థాయికి చేరింది. తర్వాత ఆ యువకుడు హెచ్‌ఐవీ బాధితుడని తెలిసింది. ఆమె ప్రియుడితోనే జీవితం కొనసాగించాలని నిర్ణయించుకుంది. మూడు సార్లు అతనితో గ్రామాన్ని విడిచి వెళ్లిపోయింది. అతన్ని తన నుంచి విడదీస్తారేమోనన్న ఆందోళనతో ఆమె అతని రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుంది. దీంతో యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఆ యువకుడిని అరెస్టు చేశారు. అనంతరం ఆ యువతికి వైద్య పరీక్షలు జరిపించగా హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్లు నిర్ధారణ అయింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని