ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-08-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభఫలితాలు ఉన్నాయి.  ఒక ముఖ్యమైన పనిని  విజయవంతంగా  పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు.  బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే  మంచి జరుగుతుంది.

తోటివారి సహకారంతో  మేలు జరుగుతుంది. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి  తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.

బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతో కలసి  ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో  స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర  విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.  

శుభ సమయం. కీలక వ్యవహారాల్లో  సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో  స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

బంధు,మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు.  నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి  ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రాన్ని చదివితే మంచిది.

శ్రమ ఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి.  మాతృసౌఖ్యం ఉంది.నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మీ మీ రంగాల్లో  సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.  పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

 

స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో  ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనఃసౌఖ్యం ఉంది. ఆర్ధికంగా శుభకాలం. గాయత్రీ మంత్రాన్ని జపించాలి

తలపెట్టిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి.  విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధు,మిత్రుల సలహాలు అవసరం అవుతాయి. మొహమాటంతో  ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని