Andhra News: యువజన శృంగార రసిక చిలిపి పార్టీ: బుద్దా వెంకన్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా పేరును ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’గా ఎంపీ గోరంట్ల మాధవ్‌ సార్థకం చేశారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ‘అవంతి అరగంట సరసం, అంబటి గంట విహారం ఆడియోలు బయటకొస్తే వారిపై జగన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి చేస్తేనే అధినేత గుర్తిస్తున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియోను బయటకు వదిలారు’ అని పేర్కొన్నారు.

పదవిచ్చినా ఆశ్చర్యం లేదు: బీటెక్‌ రవి
‘గోరంట్ల మాధవ్‌ లీలలు మెచ్చి జగన్‌ కేంద్ర మంత్రి పదవిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మహిళలపై దాడి చేస్తే పదోన్నతిస్తున్న జగన్‌రెడ్డి తీరు రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు పెరగడానికి కారణమవుతోంది’ అని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని