Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఎంపీ గోరంట్ల రూపంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ: యరపతినేని

అధికారంలోకి రాకముందు అమరావతే రాజధాని అన్నారు.. అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులు అని అంటున్నారని తెదేపా నేత యరపతినేని శ్రీనివాస్‌ వైకాపా ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యరపతినేని మీడియాతో మాట్లాడారు. ‘‘కిందిస్థాయి నాయకుల నుంచి సీఎం వరకూ ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలి. ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె మృతిపై విమర్శలు చేసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య 

తన మాజీ సతీమణి, కథానాయిక సమంతను తాను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని నటుడు నాగచైతన్య తెలిపారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోన్న ఆయన తాజాగా మరోసారి సామ్‌తో విడాకులు తీసుకోవడంపై స్పందించారు. ‘‘పరస్పర అంగీకారంతోనే మేమిద్దరం విడిపోయాం. ఆ విషయాన్ని అందరితో చెప్పాలనుకున్నాం.. చెప్పాం. కాకపోతే.. కొంతమంది కావాలని ఏవేవో వార్తలు సృష్టిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రివ్యూ: డార్లింగ్స్‌

3. తల్లికి ఎందుకిలా...? కారణాలు ఏంటో తెలుసా..!

గర్భధారణ జరిగిన తర్వాత మూడు నెలలు గడిస్తే ముప్పు తప్పిపోయినట్టే అనుకుంటాం.. కానీ కొంతమందిలో మూడు నెలల తర్వాత కూడా గర్భస్రావం అవుతుంది. ఎక్కువగా 12-24 వారాల మధ్యలో గర్భస్రావం కావడానికి ఎన్నో కారణాలున్నాయి. కొంతమందికి 9 నెలలకు ముందే కాన్పు అవుతుంది. ఈ సమస్యకు గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉండటమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్‌ భావన చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక.. రాత్రికల్లా ఫలితం

దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు పోలింగ్‌ ప్రారంభమైంది. పార్లమెంట్‌ భవనంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ పదవికి ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ ఆళ్వా పోటీలో ఉన్నారు. తొలి గంటల్లో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు జితేందర్‌ సింగ్‌, అశ్వినీ వైష్ణవ్‌ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నా మనవరాలు ఏం చేసిందని చంపేశారు..?

 గాజా సరిహద్దులో కొద్దికాలంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య చోటుచేసుకుంటోన్న ఉద్రిక్తతలు శుక్రవారం మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో అభం శుభం తెలియని ఓ పసి ప్రాణం గాల్లో కలిసింది. నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఐదేళ్ల అలా ఖదూమ్ మృత్యుఒడికి చేరుకుంది. ‘నా మనవరాలు నర్సరీలో చేరాలని కలలుకంది. బ్యాగ్‌, పుస్తకాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ అమాయకురాలు రాకెట్లను ప్రయోగిస్తోందా..? దాడుల్లో పాల్గొంటుందా..?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా?: రాజగోపాల్‌రెడ్డి

తెరాసలోకి 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఎవరూ మాట్లాడలేదని.. వారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. దిల్లీలో రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడికి సహకరించా. ఈ మూడున్నరేళ్లుగా మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో పోరాడా. 2014 తర్వాత పార్టీ పదవులు ఇవ్వకపోయినా కష్టపడ్డా.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష..సెమీస్‌లో నెగ్గాలంటే ఏం చేయాలి?

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళా క్రికెట్‌ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. శనివారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఫైనల్‌ బెర్త్‌కోసం బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఒకవైపు టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో అనూహ్య పరాజయం తరవాత వరుసగా రెండు భారీ విజయాలతో జోరు మీదుండగా.. మరోవైపు ఈ టోర్నీలో ఓటమి రుచి చూడని ఇంగ్లిష్‌ జట్టు సూపర్‌ఫామ్‌లో కనిపిస్తోంది. దీంతో ఈ రెండు జట్లు మధ్య సెమీస్‌పోరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరీ ఏ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయో చుద్దాం..!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

75 ఏళ్ల వయసులో పసిడి.. ప్రపంచ రికార్డు బద్దలు..!

8. ఆన్‌లైన్‌ రచ్చబండలు.. మాటలు మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో!

పాత రోజుల్లో చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటీ ముచ్చట్లు చెప్పుకునేవారు. ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోవాలంటే మాత్రం రచ్చబండ పెట్టేవారు. కాలం మారింది.. సాంకేతికత అభివృద్ధి చెందింది. పిచ్చాపాటీ ముచ్చట్లైనా, చర్చించుకోవడమైనా ఆన్‌లైన్‌ రచ్చబండలు వచ్చేశాయి. అదేనండీ.. సోషల్‌ ఆడియో యాప్స్‌. వీటిలో ఒకరినొకరు చూడకుండానే కూర్చున్నచోటు నుంచే కబుర్లు చెప్పుకోవచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాలేరు వాగులో చిక్కుకున్న యువకుడు.. తాడు సాయంతో బయటకు లాగిన స్థానికులు

మహబూబాబాద్‌ జిల్లాలోని పాలేరు వాగులో యువకుడు చిక్కుకుపోయాడు. జిల్లాలోని దంతాలపల్లి మండలం రామవరం శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిలో గుగులోత్‌ సురేష్‌ సురక్షితంగా బయటపడగా.. మరో యువకుడు యాకేష్‌ (18) వాగులో చిక్కుకుపోయాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌ విద్యార్థికి రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్‌ ఆనంద్‌వాడేకు అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్‌ లేఖను పంపింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐసీఎస్‌ఈ సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్‌ అమెరికాలో న్యూరోసైన్స్‌ చదవనున్నాడు. విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్‌ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని