INDw vs ENGw : కామన్వెల్త్‌ సెమీస్ పోరు.. టాస్‌ నెగ్గిన భారత్‌

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌లో కీలక నాకౌట్‌ పోరుకు తెరలేసింది.  తొలి సెమీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్‌కు బౌలింగ్‌ అప్పగించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకునే అవకాశం ఉంది. ఓడిన జట్టు కాంస్య పోరులో తలపడే అవకాశం ఉంటుంది. రెండో సెమీస్‌ (ఆస్ట్రేలియా-న్యూజిలాండ్)లో పరాజయంపాలైన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. కాబట్టి తొలిసారి కామన్వెల్త్‌లో మహిళల క్రికెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత పతకం ఖాయం చేసుకోవాలంటే టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుకోవాలి.

జట్ల వివరాలు: 
భారత్‌: స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), తానియా భాటియా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ్‌ రాణా, మేఘ్నా సింగ్, రేణుకా సింగ్

ఇంగ్లాండ్‌: డానియెల్లె వ్యాట్, సోఫియా డంక్లే, నటాలీ స్కివెర్ (కెప్టెన్), ఆమీ జోన్స్, మలా బౌచిర్, అలైస్ కాప్సీ, క్యాథరిన్‌ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్‌, ఫ్రెయ కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని