Telangana News: అలర్ట్‌.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

హైదరాబాద్‌: తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవొచ్చని వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈరోజు రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, కోట, సాగర్‌, పెండ్రా రోడ్ గుండా బాలాసోర్‌ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుందని పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఉన్న ఆవర్తనం ఇవాళ వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతోందని చెప్పారు. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని