modi-chandrababu: ప్రధాని మోదీతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ

దిల్లీ: చాలా కాలం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. వీరిద్దరూ ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ దిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత.. మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైన సందర్భాలు లేవు. తాజాగా వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించుకున్నారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏపీలో తెదేపా, భాజపా, జనసేన మధ్య పొత్తు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోదీ, చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని