Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆగస్టు 15న పుడితే.. 12 ఏళ్లు వచ్చేదాకా ఉచిత ప్రయాణం

‘అజాదీ కా అమృతోత్సవ్‌’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఉప పోరుకు సై

2. జీవన్‌రెడ్డి హత్యకు నాలుగు నెలల క్రితమే ప్రణాళిక!

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ప్రసాద్‌గౌడ్‌(43)ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. సోమవారం నగర దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌తో కలసి దక్షిణ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మువ్వన్నెలు మురిసిన వేళ..

1947 ఆగస్టు 15న హైదరాబాద్‌ స్టేట్‌లో ఏం జరిగిందంటే.. 75 ఏళ్ల క్రితం.. 1947 ఆగస్టు 15. 200 ఏళ్ల బానిస సంకెళ్ల నుంచి యావత్‌ భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు.. ఆంగ్లేయుల పీడ తొలగి మువ్వన్నెల జెండాలతో ప్రజలంతా సంబరాల్లో మునిగిన వేళ.. 500కు పైగా సంస్థానాలు రాచరిక, నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తరుణాన.. హైదరాబాద్‌ స్టేట్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. నిజాం ప్రభుత్వం జాతీయ జెండాలు ఎగురవేయకుండా నిషేధాజ్ఞలు విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సూర్యాస్తమయాన ఉదయించిన సిక్కోలు

4. కాసులు కురిపిస్తున్న నిషేధిత భూములు..!

రాష్ట్ర ప్రభుత్వం నిషేధ భూములపై ప్రకటన చేయడంతో మండలాల్లో పైరవీలు ప్రారంభమయ్యాయి. కొంతమంది నేతలు ఈ వివాదస్పద భూములపై దృష్టిపెట్టారు. భూమి విస్తీర్ణం, మార్కెట్‌ విలువను బట్టి కమిషన్లు మాట్లాడుతున్నారు. సాధారణంగా పట్టాలకే రెవెన్యూ అధికారులకు మామూళ్లు సమర్పించుకునే రైతులు, ప్రస్తుతం నిషేధిత జాబితా భూముల పరిష్కారం అంటే.. మూటలు సమర్పించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సహకారం.. స్వాహాపర్వం

ఎత్తొండ సహకార సంఘానికి సంబంధించి మాజీ డైరెక్టర్‌ ఒకరు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడంతో రికవరీ ప్రయత్నం ఆగిపోయింది. ధర్పల్లి సొసైటీ పరిధిలో సహకార చట్టం 1964 సెక్షన్‌ 60 ప్రకారం మాజీ అధ్యక్షుడికి నోటీసులు అందజేసినా నయాపైసా రాబట్టలేదు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన తాళ్లరాంపూర్‌ సొసైటీలో రూ.3.34 కోట్లు దుర్వినియోగమైంది. రికవరీ ప్రక్రియ ఇది వరకే ప్రారంభమైనా ఇంకా వసూళ్లు కాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చూస్తుండగానే..చూ మంతర్

6. విలీన మండలాలకు మళ్లీ వరద భయం

గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రానికి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ దఫా గోదావరితోపాటు శబరి నదిలోనూ వరదపోటు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. శబరిలో మట్టం గంటకు సుమారు రెండు అడుగుల చొప్పున పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట జనవనరుల కేంద్రం వద్ద శబరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 11.10 మీటర్లకు పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వర్షాలు తీన్మార్..ఇంటిటా బీమార్

మూడు రోజుల కిందట సీనియర్‌ జర్నలిస్టు ఒకరికి ఒకేసారి డెంగీ, కరోనా నిర్ధారణయ్యాయి. ప్లేట్‌లెట్లు తగ్గడంతో కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరగా, స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. మధుమేహం లేకపోయినా ఇన్సులిన్‌ చేశారు. దీంతో ఆయన మరో వైద్యుణ్ని ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు రోగులు సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నగరంలో 20 మందికి పైగా సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు వైరల్‌, డెంగీ, కరోనాలతో బాధపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చెరుకూరు టు అమెరికా

పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన కొమరాబత్తిన అక్ష నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి మరియరాజు టీకొట్టు నిర్వహిస్తున్నారు. తల్లి రత్నకుమారి దర్జీగా పని చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. నరసాయపాలెం గురుకులంలో 9, 10 తరగతులు చదివింది. ప్రిన్సిపల్‌ వినీత విద్యార్థినిలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. పదో తరగతి ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించింది. 2021లో బాపట్ల బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో చేరింది. 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిలువు దోపిడీ అంటే ఇదేనేమో..!

9. ఓ వారం... అధ్యయనానికో వరం

దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీ పోషించిన పాత్ర ఎప్పటికీ మరువలేనిది. అందుకు అనుసరించిన విధానాలేమిటన్న అంశంపై చాలా మందికి అవగాహన లేదు. దేశ వాసులు ఆయన వెంట నడవడానికి... ఆయన్ను అంతగా ఆదరించడానికి...మహానాయకుడిగా నేటికీ ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిగా నిలవటానికి కారణమేమిటన్నది ప్రస్తుత తరానికి తెలిసింది చాలా స్వల్పం. ఈ నేపథ్యంలో ఏయూలో 2006లో ‘గాంధీ అధ్యయన కేంద్రం’ (గాంధియన్‌ స్టడీస్‌ సెంటర్‌) అని ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సర్దార్‌.. సుబ్బరామదాస్‌

10. పింఛన్లు తొలగిస్తే ఎలా బతకాలి?

 ‘12 నెలల కిందట పింఛన్‌ నిలిపివేశారు. వందశాతం అంగవైక్యలం ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారో తెలియడం లేదు. పునరుద్ధరించాలని సచివాలయం, ఎంపీడీవో, ఆర్డీవో, కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు’ అని సోమందేపల్లి మండలం చాల్లపల్లికి చెందిన దివ్యాంగురాలు సంజీవమ్మ వాపోయారు. తన పింఛన్‌ (వితంతు) 13 నెలలు కిందట తొలగించారని, వందశాతం అంగవైకల్యం ఉన్న తన కుమారుడు బాలునాయక్‌ పింఛన్‌ కూడా తొలగించారని, తామెలా బతకాలని సాలీబాయి అనే మహిళ కన్నీరుమున్నీరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని