Mahesh Babu: ‘ఆ సహృదయం పేరు మహేశ్‌ బాబు’.. సూపర్‌ స్టార్‌కు తారల విషెస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినా ఎందుకో నమ్మబుద్ధికాదు. అలాంటి ఓ ప్రశ్నే మహేశ్‌ బాబు (Mahesh Babu) వయసెంత? ఆ నమ్మలేని సమాధానం.. 47 సంవత్సరాలు. అవును కదా! నాలుగు పదుల వయసు దాటినా మహేశ్‌ బాబు టీనేజర్‌లా ఉంటారు. తన తనయుడికి సోదరుడిలా కనిపిస్తారు. అందంతో మాత్రమే కాదు.. వ్యక్తిత్వంతోనూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. ఆయన సింప్లిసిటీకి సగటు ప్రేక్షకుడితోపాటు సినీ ప్రముఖులు ఫిదా అయిపోతారు. మహేశ్‌ పుట్టిన రోజు నేడు (#HappyBirthdayMaheshBabu). ఈ సందర్భంగా పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. (#HBDSuperstarMahesh)

దర్శక-నిర్మాతలకు అండగా నిలిచే హీరో: పవన్‌ కల్యాణ్‌

‘‘మహేశ్‌ బాబు తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం.. హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించటం అభినందనీయం. కృష్ణగారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. ‘అర్జున్‌’ సినిమా పైరసీ అయినపుడు దానిపై పోరాడేందుకు మహేశ్‌ గళం విప్పంగా నేనూ మద్దతిచ్చా. చిత్ర పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో మేమంతా వెన్నంటి నిలిచాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్‌ సాహు పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్‌ బాబు గాత్రమైతే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్‌ కోరగానే వెంటనే అంగీకరించిన సహృదయత ఆయనది. ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న మహేశ్‌గారు మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.

* ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్‌ చేయించిన సహృదయం పేరు మహేశ్‌ బాబు. భగవంతుడు అతడికి మరింత శక్తిని, విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. - చిరంజీవి.

* హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ అన్నా. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని, విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. - ఎన్టీఆర్.

* హ్యాపీ బర్త్‌డే మహేశ్‌. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. - రామ్‌చరణ్‌.

* హ్యాపీ బర్త్‌ డే మహేశ్‌ బాబు. మీరు ఆనందంగా ఉండాలని, మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. - మమ్ముట్టి.

* చిన్నోడా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే. - వెంకటేశ్‌.

* ఎంతోమంది చిన్నారులకు పునర్జన్మ ఇస్తున్న మనసున్న మహా రాజు మహేశ్‌ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. - రోజా.

* ‘మేజర్‌’ సినిమా ద్వారా మీ ప్రేమ, మద్దతు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు స్ఫూర్తి. హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ సర్‌. - అడివి శేష్.

* మహేశ్‌.. నీదైన చరిష్మా, స్టైల్‌తో అలరిస్తుంటావ్‌. నీ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తూ.. స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా. నువ్వు నటించిన ‘పోకిరి’ చిత్రం 16 ఏళ్లైనా ఇప్పటికీ ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించినందుకు గర్వపడుతున్నా. - మంజుల (నటి, మహేశ్‌ సోదరి).

 

* పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రదర్‌ మహేశ్‌. నువ్వెప్పుడూ దూసుకెళ్తూనే ఉండాలి.  -మంచు విష్ణు.

* సూపర్‌- హ్యాండ్‌సమ్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. మీ తదుపరి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. -రామ్‌ పోతినేని.మరిన్ని

ap-districts
ts-districts