Andhra News: గోరంట్ల మాధవ్‌ ఏం తప్పు చేశారు?: అనితకు వైకాపా కార్యకర్త ఫోన్‌

విజయవాడ: నగరంలో అఖిలపక్షాల సమావేశంలో పాల్గొన్న తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఓ వైకాపా కార్యకర్త ఫోన్‌ చేశాడు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారంటూ ఆమెను ప్రశ్నించాడు. అనిత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఫోన్‌ రావడంతో ఆమె తన మొబైల్‌ స్పీకర్‌ ఆన్‌ చేశారు. మాధవ్‌ ఏం తప్పు చేశారని.. అంత దారుణంగా అనితను వైకాపా కార్యకర్త ప్రశ్నించాడు. ఓ వైపు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. అతిగా స్పందించాల్సిన అవసరం ఏమిటని అనితను నిలదీశాడు. 

దీనిపై స్పందించిన అనిత.. తనను బెదిరిస్తున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఎంతోమంది ఆడపిల్లల ఉసురుపోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను మనం లోక్‌సభ, అసెంబ్లీలకు పంపిస్తున్నామా? అని ఆలోచించుకోవాలని సదరు వైకాపా కార్యకర్తకు అనిత హితవు పలికారు.మరిన్ని

ap-districts
ts-districts