Wayanad Collector: ఇంట్లో ఉండటం చాలా కష్టం..! విద్యార్థిని ఈమెయిల్‌ వైరల్

తిరువనంతపురం: పాఠశాలలకు వరుస సెలవులు(School Holidays) ప్రకటిస్తే సాధాణంగా విద్యార్థులు ఎగిరి గంతేస్తారు! కానీ.. కేరళ(Kerala)లో ఓ బాలిక మాత్రం తరగతులు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు ఈ-మెయిల్‌(Email) పంపడం గమనార్హం. ఇక్కడి వయనాడ్‌(Wayanad) జిల్లాకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని సఫూరా నౌషాద్‌.. జిల్లా కలెక్టర్ గీతకు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ‘నాలుగు రోజులు వరుసగా ఇంట్లో ఉండటం చాలా కష్టం. దయచేసి బుధవారం క్లాస్ నిర్వహించండి’ అని ఆమె తన మెయిల్‌లో అభ్యర్థించింది. కలెక్టర్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఆ ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేశారు. దీంతో ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వారాంతపు సెలవుల తర్వాత.. భారీ వర్షాల కారణంగా వయనాడ్‌ స్థానిక యంత్రాంగం సోమవారం బడులకు సెలవు ఇచ్చింది. విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులపాటు సెలవు వచ్చినట్లయింది. దీంతో విసుగెత్తిపోయిన ఆమె.. బుధవారం తరగతులు నిర్వహించాలని కోరుతూ ఈ-మెయిల్‌ చేసింది. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. ఆమెను అభినందించారు. మన పిల్లలు తెలివైనవారని, వారి ప్రపంచం విశాలమైనదని ప్రశంసించారు. దేశ, ప్రపంచ భవిష్యత్తు వారి చేతుల్లో భద్రంగా ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, సమాజం ఇలా అందరం.. ఎదుగుతోన్న ఈ తరం పట్ల గర్విద్దాం అని రాసుకొచ్చారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని