Roger Federer : రోజర్‌ ఫెదరర్‌.. ఐదేళ్ల కిందట హామీ.. తాజాగా నెరవేర్చి..

(2017లో ఇజ్యామ్‌, రోజర్ ఫెదరర్‌)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇవాళ ఇచ్చిన హామీని.. రెండు రోజులకో.. వారానికో మరిచిపోతుంటాం. అలాంటిది ఎప్పుడో ఐదేళ్ల కిందట ఓ చిన్నపిల్లవాడికి ఇచ్చిన ప్రామిస్‌ను నెరవేర్చాడు టెన్నిస్‌ అగ్రశ్రేణి ఆటగాడు రోజర్ ఫెదరర్‌. తాజాగా సర్‌ప్రైజ్‌ చేస్తూ తనతో ఆడాలనే యువకుడి కోరికను ఫెదరర్‌ తీర్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఓ ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. 

అది 2017.. ఆ పిల్లవాడి పేరు ఇజ్యాన్‌ అహ్మద్‌. అతడు టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు బిగ్‌ ఫ్యాన్‌. ఓ మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఫెదరర్‌కు ఓ ప్రశ్న సంధించాడు. ‘‘ఫెదరర్ మీరు కనీసం ఇంకో 8-9 సంవత్సరాలు ఆడతారా..? ఎందుకంటే కాస్త పెద్దయ్యాక మీతో ఆడతా’’ అని అడిగాడు. సమాధానంగా ‘తప్పకుండా’ అని ఫెదరర్‌ బదులిచ్చాడు.  వెంటనే ‘‘అది వాగ్దానమేగా?’’ అని ఇజ్యాన్‌ అడుగుతాడు. దానికి నవ్వుతూ ‘పింకీ ప్రామిస్’ అని రోజర్‌ సమాధానం ఇచ్చాడు. జిజౌ అని ముద్దుగా పిలుచుకునే ఇజ్యాన్‌ సంబరపడిపోయాడు. 

సీన్‌ కట్‌ చేస్తే ఐదేళ్ల తర్వాత తాజాగా ఇజ్యాన్‌ అహ్మద్‌ కల నెరవేరింది. అదెలాగంటే.. టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న జిజౌ ఇప్పుడు జ్యూరిచ్‌కు ట్రైనింగ్‌ సెషన్‌ కోసం వచ్చాడు. అక్కడ అతడిని స్పెషల్‌గా ట్రీట్‌ చేయడం.. అభిమానులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ.. ఫొటోలు దిగుతూ ఉంటారు. ఇదెంతో జిజౌను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే ఈ సన్నివేశాలను రోజర్‌ ఫెదరర్‌ టీవీలో చూస్తున్నాడన్న విషయం జిజౌకు తెలియదు. ఎందుకంటే ఇదంతా ప్లాన్‌ చేసిందే రోజర్‌ ఫెదరర్‌.. ఆ తర్వాత జిజౌను క్లే కోర్టులోకి సిబ్బంది తీసుకెళ్లారు. ‘‘ఓ అద్భుతమైన ప్రత్యర్థితో నువ్వు తలపడటం చూడాలని యువత  ఉత్సాహంగా ఎదురు చూస్తోంది’’ అని సిబ్బంది చెప్పిన వెంటనే అక్కడికి రోజర్ ఫెదరర్‌ వచ్చేస్తాడు. దీంతో జిజౌ ఒక్కసారిగా ఉద్వేగానికి గురై  ఫెదరర్‌ను హత్తుకున్నాడు. అనంతరం కాసేపు ఇద్దరూ టెన్నిస్‌ ఆడి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ వీడియోను మీరూ చూసేయండి..మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని