AP ECET: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

విజయవాడ: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. జులై 22న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 37వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. 

ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఫలితాల్లో మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. అబ్బాయిలు 91.44 శాతం, అమ్మాయిలు 95.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. మొత్తం 14 విభాగాల్లో జరగాల్సిన పరీక్షకు 11 విభాగాల్లో మాత్రమే నిర్వహించామన్నారు. కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువగా రావడంతో పరీక్ష నిర్వహించలేదని తెలిపారు. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని