Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మాధవ్‌ వీడియో ఒరిజినల్‌ కాదు: అనంతపురం ఎస్పీ
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంలో సందిగ్ధత నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ అవునా, కాదా అనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. ‘‘యూకేలో రిజిస్టర్‌ అయిన నంబర్‌తో వీడియో అప్‌లోడ్‌ అయింది. ఎంపీ వీడియో మొదట ఐ-టీడీపీ వాట్సప్ గ్రూప్‌లో షేర్‌ చేశారని..

2. తైవాన్‌పై అవసరమైతే బలప్రయోగం తప్పదు..!
తైవాన్‌లో వేర్పాటు వాదాన్ని అస్సలు సహించమని బుధవారం చైనా పునరుద్ఘాటించింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. నాన్సీ పెలోసీ పర్యటన అనంతరం తైవాన్‌ చుట్టుపక్కల భారీ ఎత్తున చైనా యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. చైనాకు చెందిన తైవాన్‌ అఫైర్స్‌ ఆఫీస్‌ ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.

3. మస్క్‌ రూటే సెపరేటు.. అమ్మనన్నారు.. కానీ, అమ్మేశారు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల దాదాపు ఏడు బిలియన్‌ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. ఈ విషయం రెగ్యులేటరీ ఫైలింగ్స్‌ ద్వారా వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.

4. అవును మోదీజీ.. మీరు చెప్పింది నిజమే..ఇప్పుడదే చేశాం..!
భాజపాను వీడి, ప్రత్యర్థి పార్టీ ఆర్జేడీతో చేతులు కలిపారు జేడీ(యూ) అగ్రనేత నీతీష్‌ కుమార్. దీనిపై భాజపా గుర్రుగా ఉంది. ఇది ఓటర్ల తీర్పును అవమానించడం కిందికే వస్తుందని మండిపడింది. ఈ సమయంలో 2017లో ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను ఆర్జేడీ గుర్తుచేసింది. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం బిహార్‌ ప్రజలకు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉందంటూ అప్పుడు ట్విటర్‌లో మోదీ పోస్టు చేశారు.

5. చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు: పయ్యావుల
తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపలను వస్తున్నాయని ఏపీ పీఏసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. మూడేళ్ల తర్వాత దిల్లీ వెళ్లిన చంద్రబాబుతో మాట్లాడేందుకు అక్కడ చాలా మంది నేతలు ఉత్సాహం చూపించారని చెప్పారు. అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ కూడా దిల్లీ వెళ్లారని.. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై ప్రధానితో ఏమైనా చర్చించారా? అని ఆయన ప్రశ్నించారు.

6. జీవితంలో ఏం జరిగినా ఆనందంగా స్వీకరించాలి: నాగచైతన్య
‘‘జీవితంలో ఏం జరిగినా ఆనందంగా ఉండాలి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని అంటున్నారు నటుడు నాగచైతన్య. ఆయన కీలకపాత్రలో నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తనకెంతో ప్రత్యేకమన్నారు. చైతన్య పంచుకున్న మరిన్ని విశేషాలివీ..

7.  పెద్దోళ్లు పట్టించుకోలేదు.. పసిపిల్లలు చేయందించారు..
పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు అని అంటుంటారు కదా.. కానీ, ఈ వీడియో చూశాక పసిపిల్లలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. రోడ్డుపై కష్టాల్లో ఉన్న ఓ మనిషిని పెద్దోళ్లంతా చూసిచూడనట్లుగా వెళ్లిపోతుంటే.. నిండా పదేళ్లు కూడా లేని ఈ చిన్నారులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమ చిట్టిచేతులతో ఆ మనిషి కష్టం తీర్చారు. సాయం చేయాలనే ఆలోచన ఉండాలే గానీ..

8. 2014లో మోదీ విన్నరే.. 2024లో గెలుస్తారా?: నీతీశ్‌
పట్నా: బిహార్‌లో మహాకూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీ(యు) అధినేత నీతీశ్‌ కుమార్‌ (Nitish kumar) ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదంటూ భాజపా చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు.

9. భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్‌
ఇటీవల టీమ్‌ఇండియాలో చోటు కోసం ఆటగాళ్ల మధ్య  పోటీ పెరిగింది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై భారత మాజీ వికెట్‌కీపర్‌ కిరణ్‌ మోరే ఓ క్రీడా ఛానల్‌లో విశ్లేషించాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ స్థాయిని పెంచుకొని  బ్యాటింగ్‌తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలిగినందుకు మోరే అతణ్ని ప్రశంసించాడు. ఇటువంటి ఆటగాళ్లు జట్టుకు ఎల్లప్పుడూ అవసరమని చెప్పాడు.

10. రైతుకు దొరికిన వజ్రం.. ఎంతకు అమ్మాడో తెలుసా?
తుగ్గలి: కర్నూలు జిల్లాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. టమాటా పైరులో రైతు కుమార్తె కలుపు తీస్తుండగా వజ్రం దొరికొంది. వివరాల్లోకి వెళితే తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం పొలంలో కలుపు పనుల్లో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువైన వజ్రం లభించింది..


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని