Aortic Aneurysm: రక్త నాళాల్లో వాపు ఎందుకొస్తుందో తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రక్త నాళాల్లో ఒత్తిడి మరింత పెరిగితే లేనిపోని సమస్యలు వస్తాయి. రక్తనాళాల్లో వాపు వస్తే గాలి బుడగలు కూడా ఏర్పడుతాయి. ఈ పరిస్థితిని వైద్యులు అయొర్టిక్‌ ఎనూరిజమ్‌గా పిలుస్తారు. ఈ సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి ఇబ్బందికర స్థితి ఎందుకొస్తుందో సిటీసర్జన్‌ డాక్టర్‌ మన్నం గోపిచంద్‌ వివరించారు. ఈ రక్త నాళం పెద్ద ధమని. శరీరంలో చాలా పెద్దది. గుండె నుంచి కాలిదాకా రక్తసరఫరా చేస్తుంది. దీనికి వాపు వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది.

వాపు ఎందుకు..?: కొన్ని కారణాలతో రక్తనాళాల గోడ బలహీన పడుతుంది. అధిక రక్తపోటుతో ఆ నాళం ఉబ్బిపోతుంది. 2 సెం.మీ లోవుండే రక్తనాళం ఐదు సెంటీమీటర్ల దాకా పెరుగుతుంది.

చికిత్స ఎలా..:  వీటిని తగ్గించేందుకు శస్త్రచికిత్స చేయాల్సిందే.  కొన్నిరకాల ఆపరేషన్లు ప్రమాదకరమైనవి. చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. గుండె, లివర్‌, కిడ్నీలకు వెళ్లే ధమనికి సమస్య వస్తే వైద్యుల బృందంతోనే చేయాలి. చికిత్స తర్వాత సాధారణ జీవితం గడపొచ్చు. 



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని