Sweets: బంగారు పూత పూసిన స్వీట్.. ఈ మధుర పదార్థం ధరెంతో తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో పండుగల సీజన్ మొదలైంది. అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముల ఆత్మీయతను చాటే రక్షాబంధన్‌ వేడుకను ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. రాఖీ కట్టిన వేళ.. నోరు తీపి చేసుకునేందుకు పక్కన స్వీట్ ఉండాల్సిందే..! భారీతనాన్ని ఇష్టపడే భారతీయుల చెంతన ఆ మధుర పదార్థాలు మెరుగులు అద్దుకుంటున్నాయి. వెండి పూతతో ఉన్న స్వీట్లు మనకు కొత్తేం కాదు. ఇటీవల కాలంలో బంగారు పూత ఉన్న స్వీట్లు మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి.  

ఈ రక్షాబంధన్‌ను పురస్కరించుకొని బంగారు పూత పూసుకున్న స్వీట్లను మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ దుకాణం అమ్మకానికి పెట్టింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కొత్త ప్రయత్నం చేసింది. వీటితో నోరు తీపి చేసుకోవాలంటే కేజీకి రూ.6 వేలు చెల్లించాలి. ఈ బంగారు స్వీట్‌ను రుచి చూడాలంటే.. మరి ఆ మాత్రం చెల్లించాల్సిందేగా..!  ఇంతకు ముందు రాజస్థాన్‌ వెరైటీ ఘెవార్‌ (గుండ్రంగా ఉండే)ను అమ్మకానికి ఉంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ స్వీట్‌ షాప్ వార్తల్లో నిలిచింది. 24 క్యారెట్ల బంగారు పూతతో సిద్ధమైన ఇది ఎంత పలికిందో తెలుసా..? అక్షరాల రూ.25 వేలు..! కొత్తదనం, భారీదనం కావాలంటే అంతేమరి..!


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని