Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్‌.. ప్రభాస్‌గా ఎవరంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. తన కొడుకు నీల్‌ (Niel)తోనే పూర్తిగా సమయాన్ని గడుపుతున్నారు. ఆ చిన్నారితో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం కాజల్‌ షేర్‌ చేసిన ఓ పిక్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సూపర్‌ హిట్‌ చిత్రం ‘బాహుబలి’లోని (Baahubali) ఓ పవర్‌ఫుల్‌ సీన్‌ని తలపించే స్టిల్‌ అది. ఆ చిత్రంలో.. కట్టప్ప (సత్యరాజ్‌) తలపై ప్రభాస్‌ (బాహుబలి) కాలు మోపే సన్నివేశం ఉంది కదా.. దాన్నే రీ క్రియేట్‌ చేసి, రాజమౌళికి అంకిమిచ్చారు కాజల్‌.  అలా కాజల్‌.. కట్టప్పగా మారి, ముద్దుల తనయుణ్ని.. బాహుబలి ప్రభాస్‌ని చేశారు.

అగ్ర కథానాయికగా కొనసాగుతూనే కాజల్‌ 2020 అక్టోబర్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులకు నీల్‌ జన్మించాడు. వ్యక్తిగతంగా బిజీగా ఉండటంతో కాజల్‌ కొన్నాళ్లు సినిమా చిత్రీకరణలకు దూరంగా ఉన్నారు. ‘హే సినామిక’ చిత్రంతో ఈ మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కాజల్‌ ‘భారతీయుడు 2’ (Indian 2) సినిమా చిత్రీకరణలో త్వరలోనే పాల్గొననున్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. గతంలో విజయవంతమైన ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా రూపొందుతోంది. దీంతోపాటు ఆమె చేతిలో ‘కరుంగాపియమ్‌’, ‘ఘోష్టి’ అనే తమిళ చిత్రాలు, ‘ఉమ’ అనే హిందీ చిత్రం ఉన్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆ సినిమాలు త్వరలోనే విడుదలకానున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts