Vijay Deverakonda: అభిమానుల అత్యుత్సాహం.. నిమిషాల్లో మాల్‌ వదిలి వెళ్లిపోయిన విజయ్‌ దేవరకొండ

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యూత్‌లో ఈ హీరోకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో అభిమానులు అత్యుత్సాహం కనబర్చడంతో విజయ్‌ దేవరకొండ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’ (Liger). పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. అనన్యా పాండే కథానాయిక. ఆగస్టు 25న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముంబయి, పట్నా‌, అహ్మదాబాద్‌లలో ఈవెంట్స్‌ ఏర్పాటు చేయగా.. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తాజాగా పుణెలో నిర్వహించిన ఈవెంట్‌లోనూ ఇదే క్రేజ్‌ కొనసాగింది. ఓ షాపింగ్‌మాల్‌ మొత్తం అభిమానులతో నిండిపోయింది. అదే సమయంలో స్టేజ్‌పైకి చేరుకున్న విజయ్‌ - అనన్యలను చూసి అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు. స్టేజ్‌ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ హీరోహీరోయిన్ల దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని కంట్రోల్‌ చేయడం కష్టమని భావించిన సెక్యురిటీ సిబ్బంది ఇదే విషయాన్ని విజయ్‌ - అనన్యకు చెప్పి వారిద్దర్నీ అక్కడి నుంచి పంపించి వేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.




మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని