Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి..

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీళ్లే..

2. విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలి: వివేకా కుమార్తె పిటిషన్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శిలగా మారిన ఆ సోదరుడి వెనుక కథ తెలిస్తే.. కన్నీరు ఆగుతుందా..?

చిలిపి తగాదాలు, అలకల మధ్యలోనే అంతులేని అనురాగాన్ని పంచుకుంటారు తోబుట్టువులు. రక్షా బంధన్ రోజున తమ అనుబంధానికి గుర్తుగా సోదరి రాఖీ కడితే.. నీ కష్టసుఖాల్లో మేం అండగా ఉంటామని భరోసా ఇస్తారు అన్నాదమ్ములు. ఇలాగే శత్రువుల నుంచి దేశాన్ని కాచే సైనిక సోదరుడికి రాఖీ కట్టింది ఓ మహిళ. కానీ.. అతడు మాత్రం ఆమెను చూసి నవ్వలేదు. ఆత్మీయంగా దగ్గరికి తీసుకోలేదు. కనీసం ఓ బహుమతి కూడా ఇవ్వలేదు. కళ్లెదుటే ఉన్న సోదరుడిలో చలనం లేకపోతే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అద్దెపై 18 శాతం జీఎస్‌టీ.. అందరూ చెల్లించాల్సిందేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జూన్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేశారు. ఇవి జులై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. అద్దెకుంటున్నవారు అద్దెపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలన్నది అందులో ఒకటి. ఇప్పటి వరకు నివాస సముదాయాలను ఆఫీసులు, దుకాణాల వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటేనే జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మాత్రం ఎలాంటి అవసరానికి అద్దెకు తీసుకున్నా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

శాంసంగ్‌ వారసుడికి కొరియా క్షమాభిక్ష..!

5. తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ ఈసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ పూర్తయిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఈసెట్‌ ర్యాంకులను ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఈ పరీక్షను నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్య.. మరో వలసకూలీ దారుణ హత్య..!

కశ్మీర్‌ లోయలో మరోసారి ఉగ్రవాదుల లక్షిత దాడులు మొదలయ్యాయి. గతవారం బిహార్‌కు చెందిన వలసకూలీలపై ముష్కరులు కాల్పులు జరిపి ఓ వ్యక్తిని పొట్టనబెట్టుకోగా.. తాజాగా మరో వలసకూలీ ఉగ్రవాదుల తుపాకులకు బలయ్యాడు. బాందీపొరా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఓ కూలీని ముష్కరులు కాల్చి చంపారు. కశ్మీర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్‌..

కొణిదెల కుటుంబం నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టిన మరో నటుడు పవన్‌ తేజ్‌ (Pavan Tej) ఓ ఇంటి వాడవుతున్నాడు. నటి, బుల్లితెర వ్యాఖ్యాత మేఘనతో (Meghana) ఆయన ఏడడుగులు వేయనున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వీరి నిశ్చితార్థం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ, దర్శకుడు మెహర్‌ రమేశ్‌, సుమ - రాజీవ్‌ కనకాల దంపతులు హాజరయ్యారు. ఈ జంటను ఆశీర్వదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇది శిఖర్ ధావన్‌ను అవమానించడమే.. బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం

టీమ్‌ఇండియా జింబాబ్వే పర్యటనకు సంబంధించి గతరాత్రి కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి బీసీసీఐ సెలెక్టర్లు ఇదివరకే జట్టును ప్రకటించగా దానికి శిఖర్‌ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ తిరిగి ఫిట్‌నెస్ సంపాదించడంతో.. అతడిని కెప్టెన్‌గా చేసి ధావన్‌ను వైస్‌ కెప్టెన్‌గా మార్చారు. దీంతో అటు అభిమానులు, ఇటు నెటిజన్లు.. సెలెక్టర్ల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పొట్టి క్రికెట్‌లో ‘600 వికెట్లు’ తీసిన ఒకే ఒక్కడు

9. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి వద్ద కారు బీభత్సం

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ గుడి వద్ద కారు అతివేగంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్‌ బానోతు చందు మద్యం మత్తుతో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో ఆల్కహాల్‌ శాతం 111 పాయింట్లు ఉన్నట్లు నిర్ధారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎలాన్‌ మస్క్‌ సొంత సోషల్‌ మీడియా ప్రారంభించనున్నారా?

ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే టెక్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ తరచూ తన పోస్టులతో యూజర్లను గందరగోళానికి గురిచేస్తుంటారు. ఆయన పెట్టిన సందేశాల వెనుక అర్థమేంటో తెలుసుకోవడానికి ఒక్కోసారి బుర్ర గోక్కోవాల్సి వస్తుంటుంది! తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ అలాంటి పరిస్థితికే దారి తీసింది. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అయితే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts