Meesho: తెలుగులో మీషో సేవలు.. మరో 7 ప్రాంతీయ భాషల్లోనూ!

దిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ మీషో వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫామ్‌పై కొత్తగా మరో 8 భాషలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు సహా బెంగాలీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లోనూ మీషో సేవల్ని ఆనందించవచ్చు. ప్రాంతీయ భాషల్లో సేవల్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై మీషో యూజర్లు తమ మాతృభాషలో ఉత్పత్తుల సమాచారాన్ని వీక్షించొచ్చు. చెల్లింపులు, ఆర్డర్ల స్థితి వంటి వివరాలను సైతం ఎంచుకున్న భాషలోనే తెలుసుకోవచ్చు. గత ఏడాదే మీషో హిందీని ప్రవేశపెట్టింది. దాదాపు 20 శాతం మంది ఈ భాషలో సేవల్ని పొందుతున్నారు. టైర్‌-2 పట్టణాలు సహా గ్రామీణ ప్రాంతాల యూజర్లకు చేరువకావడమే లక్ష్యంగా మీషో ఈ దిశగా అడుగులు వేస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని