TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 3 విడతల్లో ఎంసెట్‌ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

* ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌ స్లాట్ బుకింగ్

* ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన

* ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు

* సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు

* సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్

* సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్

* సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన

* సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు

* అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

* అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్

* అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన

* అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

* అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

* అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ


మరిన్ని

ap-districts
ts-districts