Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మహాత్ముడి మందిరం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి పక్కన మహాత్మా గాంధీ ఆలయం నిర్మించారు. ‘మహాత్మా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో దాతలు అందించిన విరాళాలతో ఈ గుడిని నిర్మించారు. గుంటూరుకు చెందిన మోర శ్రీపాల్‌రెడ్డి ట్రస్టీగా, భూపాల్‌రెడ్డి గౌరవ అధ్యక్షుడిగా మరికొందరి దాతలతో కలసి 2004లో నరసరావుపేటలో ‘మహాత్మా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వేటపాలెంలో మహాత్ముడి అడుగు జాడలు!

2. అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్‌ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ

త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని.. బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని కొనియాడారు. గాంధీ, సుభాష్‌చంద్రబోస్‌, అంబేడ్కర్‌ వంటివారు మార్గదర్శకులని చెప్పారు. ఎంతోమంది సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారన్నారు. మహనీయుల తిరుగుబాట్లు మనకు స్ఫూర్తి అని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఎగురవేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తా...

నియోజకవర్గంలో వైకాపా నాయకులు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లను వేధిస్తున్నారు. నాలుగు రోజులుగా వైకాపా నాయకుడు చిరంజీవిరెడ్డి మద్యం తాగి సచివాలయంలోకి చొరబడి సచివాలయ సిబ్బందిని, గ్రామ వాలంటీర్లపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఆపై చరవాణిలో మీరెలా ఉద్యోగాలు చేస్తారో చూస్తా అంటూ బెదిరిస్తున్నారు. మూడు రోజులకు ముందు సర్పంచి ధర్మారెడ్డి కుమారుడు క్రాంతికుమార్‌రెడ్డి అతని అనుచరుడు చిరంజీవిరెడ్డి సచివాలయంలోని సిబ్బంది, వాలంటీర్లను కార్యాలయ నుంచి బయటకు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నిత్యం అ‘శాంతి’..!

4. ఇది అదృష్టంతో మన ఒప్పందం..

అర్ధరాత్రి వేళ... ఆంగ్లేయుల్ని పారదోలి... అధికారం చేపట్టిన శుభక్షణాన ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తొలి ప్రసంగంలోని ముఖ్యాంశాలు... చాలా ఏళ్ల క్రితం.. అదృష్టంతో మనమో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు మన ప్రతిజ్ఞను మరింత దృఢంగా నెరవేర్చాలి. ఈ అర్ధరాత్రివేళ ప్రపంచమంతా నిదురిస్తుంటే, భరతజాతి స్వేచ్ఛావాయువులతో మేలుకొంటుంది. పాత నుంచి కొత్తలోకి అడుగుపెడుతున్నప్పుడు, ఒక తరం ముగిసినప్పుడు, సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి ఆత్మ ఊరట పొందినప్పుడు.. అలాంటి తరుణం చరిత్రలో చాలా అరుదుగా వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

5. రవాణా కష్టాలు మళ్లీ మొదలు..

కాగజ్‌నగర్‌- దహెగాం ప్రధాన రహదారి మార్గంలో మళ్లీ రవాణా కష్టాలు మొదలయ్యాయి. వంతెన నిర్మించక ముందు పడిన ఇక్కట్లు 22 ఏళ్ల తర్వాత పునరావృతం అయ్యాయి. పెద్దవాగు వంతెనపై పిల్లర్‌ మరింత కుంగడంతో సమస్య మొదటికొచ్చింది. 1999 సంవత్సరం కంటే మొదలు ఈ మార్గంలోని ఒర్రెలు, వాగులపై వంతెనలు, రోడ్డు నిర్మాణాలు లేక ఎన్నో అవస్థలు పడ్డారు. 2000 సంవత్సరంలో కాగజ్‌నగర్‌ నుంచి దహెగాం వరకు బీటీ రోడ్డు, పెద్దవాగుతో పాటు పలువాగులు, ఒర్రెలపై వంతెనల నిర్మాణాలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చుట్టూ నీరు.. ఆపై చీకటి!

6. తిరంగను గౌరవంగా పరిహరించండి

మువ్వన్నెల జెండా దేశ గౌరవానికి ప్రతీక. ఎందరో అమరువీరుల త్యాగాలతో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సూచిక. అందుకే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేటప్పుడు, అవనతం చేసేటప్పుడే కాదు.. పునర్వినియోగించలేని పక్షంలో దాన్ని పరిహరించేటప్పుడు కూడా నియమ నిబంధనలను పాటించాలి. జెండా గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలి. ప్రధాని మోదీ ఇచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ జెండాలను ఇళ్లపై ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నగరంలోనూ.. అండమాన్‌ జైలు

బ్రిటిష్‌సైన్యం స్వాతంత్య్ర విప్లవకారులను అండమాన్‌లోని కాలాపానీ జైలుకు తరలించి ఎంత పాశవికంగా వ్యవహరించారో ఇప్పటికీ కథలుగా చెబుతారు. అలాంటి జైలే నగరంలోనూ ఉందని మీకు తెలుసా? తిరుమలగిరిలో ఉన్న దీన్ని 1858లో నిర్మించారు. ఇందుకు అప్పట్లో రూ.4.71లక్షలు వ్యయం చేసినట్లు రికార్డులున్నాయి. ఇక్కడి నిర్మాణాన్ని చూసే కాలాపానీని 1906లో నిర్మించినట్లు చెబుతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మొదటిగా ఆస్ట్రేలియాలో... చివరిగా ఉత్తర అమెరికాలో..

8. శాంతి దూతలు.. శాస్త్ర స్రష్టలు

స్వాతంత్య్రానికి పూర్వమే రవీంద్రుడు, రామన్‌ నోబెల్‌ పురస్కారాలకు బాటలు వేస్తే.. స్వాతంత్య్రానంతరం మరికొందరు  ఆ దారిలో నడిచారు. శాస్త్ర సాంకేతిక, సాహిత్యాది రంగాల్లో అసమాన ప్రతిభ చూపి ప్రపంచ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. మొత్తంగా పదిమంది భారతీయులు నోబెల్‌ సొంతం చేసుకున్నారు.  వీరిలో కొందరు భారత మూలాలున్న వేరే దేశాల పౌరులూ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దర్శన యాతన తీరేదెన్నడో..?

రామప్పను చూసేందుకు నిత్యం వందలాది మంది తరలివస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయడం లేదు. వృద్ధులు, వికలాంగులను తీసుకువెళ్లడం కోసం కనీసం వీల్‌ఛైర్లు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ ప్రాంగణం బురదమయంగా మారింది. అక్కడక్కడ వరద నిలవడంతో అవస్థలు పడుతున్నారు. సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నమ్మండి... ఇది తారు రోడ్డే

10. కోహినూర్‌ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్‌ మ్యూజియాల్లో..

ఆంగ్లేయులు మన విలువైన సంపదను దోచుకెళ్లారనగానే చాలామందికి గుర్తుకొచ్చేది... బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్‌ వజ్రమే. కానీ భారత్‌ను 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌ వారు అంతకన్నా ఎన్నో రెట్ల విలువైన అపూర్వ కళాఖండాలు, సౌందర్య శిల్పాలు, వెలకట్టలేని వస్తు సంపదను కొల్లగొట్టుకుపోయారు. ఇలా దోచుకెళ్లిన సుమారు 40 వేలకు పైగా చారిత్రక, వారసత్వ ఆధారాలు లండన్‌లోని విక్టోరియా, ఆల్బర్ట్‌ మ్యూజియంలో నేటికీ కాంతులీనుతున్నాయి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని