Independence Day: ఒక్క క్షణం.. మన రియల్‌ హీరోలకు ప్రణమిల్లుదాం

హైదరాబాద్‌: భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలర్పించిన ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుని.. వారి త్యాగాలను స్మరించుకుందామంటున్నారు సినీ తారలు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి, ఎన్టీఆర్‌, చియాన్‌ విక్రమ్‌, ఎస్‌.జె. సూర్య, తాప్సి, కల్యాణ్‌ రామ్‌, ప్రభాస్‌, సమంత, ఐశ్వర్యా రాజేశ్‌.. ఇలా తారలందరూ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుడిగా జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని విక్రమ్‌, ప్రభాస్, మంచు లక్ష్మి‌.. పలువురు సెలబ్రిటీలు తెలిపారు.

‘‘యావన్మంది భారతీయులకు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు గర్వంగా రెప రెప లాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం’’ - చిరంజీవి

‘‘ప్రతి ఒక్కరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్‌’’ - ఎన్టీఆర్‌

‘‘మన రియల్‌ హీరోలందరినీ స్మరించుకోవడానికి ఒక్క నిమిషం వెచ్చిద్దాం. అలాగే, మన భవిష్యత్తును మరింత సుసంపన్నంగా మార్చుకోవడానికి జీవితమంతా కృషి చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తోటి భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’’ - కల్యాణ్‌ రామ్‌

‘‘ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మన దేశం కోసం నిస్వార్థంగా తమ ప్రాణాలను అర్పించిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం!! ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!!’’ - ఐశ్వర్యా రాజేశ్‌

‘‘మన జెండా మన గౌరవం.. భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’’ - మంచు లక్ష్మి

‘‘అందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మహాత్ముని నేతృత్వంలో ఎందరో మహానుభావుల త్యాగఫలం మూలంగా నేడు మనం స్వేచ్ఛా వాయువులను పిలుస్తున్నాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులకు శిరసువంచి నమస్కరిస్తూ.. జై హింద్‌’’ - పరుచూరి గోపాలకృష్ణమరిన్ని

ap-districts
ts-districts