India Corona : 15 వేల కొత్త కేసులు.. 32 మరణాలు

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 15 వేల లోపు కేసులు రాగా.. 30కిపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 1,98,271 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 14,917 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 7.52 శాతానికి చేరింది. మరోవైపు నిన్న 32 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,27,069కు చేరింది. ఇప్పటి వరకూ 4.36 కోట్ల(98.54%) మందికిపైగా కోలుకోగా.. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,17,508(0.27%)గా ఉంది.

ఇక దేశవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌ ద్వారా నిన్న 25,50,276 మందికి టీకాలు అందించగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 208 కోట్లు దాటింది.


మరిన్ని

ap-districts
ts-districts