Puri Jagannadh: విజయ్‌ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్‌

హైదరాబాద్‌: కష్టాల్లో అండగా నిలిచి.. తనను ఓ తండ్రిలా విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) చూసుకున్నాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన ‘లైగర్‌’ (Liger) ఫ్యాన్‌డమ్‌ మీట్‌లో పాల్గొన్న పూరీ.. విజయ్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భార్య లావణ్య (Lavanya Puri) చెప్పడం వల్లే ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) వీక్షించానని.. ఆ సినిమా చూస్తున్నప్పుడే విజయ్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన అప్పుల గురించి తెలుసుకొని విజయ్‌ రూ.2 కోట్ల పారితోషికం వెనక్కి పంపించేశాడని తెలిపారు.

‘‘కరణ్‌ జోహార్‌కు ముందు థ్యాంక్స్‌ చెప్పాలి. ఆయన కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌. ‘లైగర్‌’ విషయంలో ఆయన మాకెంతో సపోర్ట్‌ చేశారు. అపూర్వ మెహ్త, ధర్మా టీమ్‌ మొత్తానికి నా ధన్యవాదాలు. ‘కొత్త దర్శకులు వస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. నువ్వు వెనుకబడిపోతున్నావ్. కొంచెం పక్క వాళ్ల సినిమాలు కూడా చూస్తూ ఉండు‌. ఎవరో సందీప్‌ రెడ్డి వంగా అట. కొత్తగా వచ్చాడు. విజయ్‌ అనే యువ నటుడితో ‘అర్జున్‌ రెడ్డి’ తీశాడు. సినిమా బాగుంది. మన ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే మూడు సార్లు ఆ సినిమా చూశాం’ అంటూ ఓరోజు నా భార్య నన్ను తిట్టింది. లావణ్య చెప్పడంతో నేనూ ఆ సినిమా చూశా. 45 నిమిషాలయ్యే సరికి సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించలేదు. కేవలం విజయ్‌ యాక్టింగ్‌ పైనే నా ఫోకస్‌ నిలిచిపోయింది. అతడి నటనలో నిజాయతీ ఉందనిపించింది. అతడితో ఎలాగైనా సినిమా చేయాలనిపించింది. ఇక ‘లైగర్‌’లో ఏ సీన్‌ చూసినా..  ఎక్కడా విజయ్‌ నటనలో పొగరు కనిపించదు. కేవలం నిజాయతీ మాత్రమే కనిపిస్తుంది. విజయ్‌ రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే. ఒక నిర్మాతగా అతడికి ఓసారి రూ.కోటి పంపిస్తే.. ‘నాకు ఇప్పుడే వద్దు ఈ డబ్బుని ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండి. నేను తర్వాత తీసుకుంటా’ అని చెప్పాడు. ఆ తర్వాత మరోసారి రూ.రెండు కోట్లు పంపిస్తే నాకు అప్పులున్నాయని తెలుసుకుని.. ‘ఈ డబ్బుతో మీరు ముందు అప్పులు తీర్చేయండి’’ అని ఆ డబ్బుని వెనక్కి పంపించేశాడు. సినిమా జరుగుతునన్ని రోజులు నాకెంతో సపోర్ట్‌గా నిలిచాడు. నన్నొక తండ్రిలా చూసుకున్నాడు. ఇలాంటి నటుడిని నేనెక్కడా చూడలేదు’’ అని పూరీ చెప్పుకొచ్చారు.



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని