Independence Day : టీమ్‌ఇండియా జెర్సీలోనే మ్యాజికల్‌ పవర్‌ ఉంది..!

దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన క్రీడాకారులు

ఇంటర్నెట్ డెస్క్: భారత స్వాతంత్ర్య వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట వజ్రోత్సవాలను గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియా తరఫున దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జెండా వందనం చేసిన ఫొటోలను పంచుకున్నారు.

మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌, వసీం జాఫర్, మహమ్మద్ కైఫ్‌, పఠాన్‌ సోదరులు, మాజీ సారథి విరాట్ కోహ్లీ, తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్లు మేరీ కోమ్‌, నిఖత్‌ జరీన్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అలానే భారత్‌తో అనుబంధం కలిగిన డేవిడ్ వార్నర్‌ తన అభిమానులు, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు.

* సారే జహా సే అచ్చా.. హిందూస్థాన్‌ హమారా.. మనం హిందూస్థానీలమనేదే మన గుర్తింపు. ఒక దేశం మీ కోసం హృదయాన్ని ఇచ్చింది. మీ కోసమే ఈ దేశం - వీరేంద్ర సెహ్వాగ్

* 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు ప్రతిజ్ఞలు చేద్దాం. ఒకటి..  ఎవరూ చూడనప్పుడూ మంచి పనులు చేద్దాం.. అలానే ఎవరి సమక్షంలో లేకపోయినా మంచి విషయాలను చెబుదాం - గౌతమ్‌ గంభీర్‌

* దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - సచిన్ తెందూల్కర్‌

* తిరంగా మ్యాజికల్‌ పవర్‌ ఏంటో భారత జెర్సీ వేసుకున్న మాకు తెలుసు. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను బలంగా నమ్ముతా - మహమ్మద్ కైఫ్‌

* భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం మాటల్లో వర్ణించలేని అనుభూతి. ఇతర దేశాల సరసన భారత జెండాతో నిలబడటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భవిష్యత్తు ఇంకా బంగారుమయం కావాలని ఆశిస్తున్నా - నిఖత్‌ జరీన్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని