Viral Video: ఇద్దరు వైద్యుల డ్యాన్స్‌.. ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన ఇద్దరు వైద్యులు చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మధ్యే విడుదలైన పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘కడువ’ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘పాలా పల్లి తిరుపల్లి’కి వారిద్దరు కలిసి స్టెప్పులేశారు. వయనాడ్‌లోని ట్రైబల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సవన్‌ సరా మ్యాథ్యూ, మెడికల్ ఆఫీసర్‌ డా.సఫిజ్‌ అలీ ఇద్దరు కలిసి ఆ పాటకు స్టెప్పులేయడం విశేషం.

ఆ వీడియోను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఫేస్‌బుక్‌లో పంచుకొని ఆ వైద్యులను ప్రశంసించారు. డా.సరా మ్యాథ్యూ, డా.సఫిజ్‌ అలీ ఇద్దరూ అత్యుత్తమ వైద్యులని.. అలాగే మంచి డ్యాన్సర్లంటూ కొనియాడారు. ఆ ఆసుపత్రి సిబ్బంది  వేలాది మంది రోగులకు ఉత్తమ సేవలందిస్తున్నారని ప్రశంసించారు.



మరిన్ని

ap-districts
ts-districts