Mahindra Electric: ఈవీలపై మహీంద్రా దృష్టి.. 5 ఎస్‌యూవీల ఆవిష్కరణ

లండన్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా (Mahindra) ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పాసింజర్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఏకంగా ఐదు ఎలక్ట్రిక్‌  ఎస్‌యూవీలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఐదు వాహనాలను లండన్‌లో సోమవారం ఆవిష్కరించింది. వినియోగదారుల్లో పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ సహకారం ఉన్న వేళ ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

2024లో తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని, 2026లో మిగిలిన వాహనాలను తీసుకురానున్నట్లు మహీంద్రా తెలిపారు. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వీటిని తీసుకురానున్నట్లు ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను XUV, BE బ్రాండ్ల కింద తీసుకురానున్నారు. XUV బ్రాండ్‌ కింద XUV.e8, XUV.e9 ఎస్‌యూవీలను తీసుకురానున్నారు. BE బ్రాండ్‌ కింద BE.05, BE.07, BE.09 వాహనాలను తేనున్నారు. ఈవీ ప్రణాళికలో భాగంగా కాన్సెప్ట్‌ వీడియోను మహీంద్రా విడుదల చేసింది. మరోవైపు బ్రిటీష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (BII) మహీంద్రా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ వెంచర్‌లో 250 మిలియన్ల అమెరికన్‌ డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.



మరిన్ని

ap-districts
ts-districts