Swine flu: ముంబయిలో స్వైన్‌ఫ్లూ విజృంభణ.. 15రోజుల్లో ఎన్నికేసులంటే?

ముంబయి: మహరాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో స్వైన్‌ఫ్లూ (swine flu) కలకలం రేపుతోంది. 15 రోజుల వ్యవధిలో ముంబయి (Mumabi)లో 138 స్వైన్‌ ఫ్లూ కేసులతో పాటు 412 మలేరియా, 73 డెంగీ కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ఆగస్టు 1 నుంచి 14వరకు నమోదైనట్టుగా తెలిపారు. జులై నెలలో 105 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా.. 61 డెంగీ, 563 మలేరియా కేసులు వచ్చాయని.. గత నెలతో పోలిస్తే ఆగస్టులో ఈ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) కేసులు నగరంలో పెరుగుతున్నాయిని అధికారులు తెలిపారు. హెచ్‌1ఎన్‌1ను నియంత్రించేందుకు పలు సూచనలు చేశారు. దగ్గడం, చీదడం చేసేటప్పుడు ముఖాన్ని కవర్‌ చేసుకోవాలని సూచించారు. అలాగే, తరచూ చేతుల్ని సబ్బు, మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలని, కళ్లు, ముక్కు, నోటి భాగాలను చేతులతో తాకొద్దన్నారు. స్వీయ చికిత్సలు కాకుండా వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు.


మరిన్ని

ap-districts
ts-districts