Cyber Crime: క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.45 వేలు.. కొట్టేసింది రూ.41 లక్షలు!

ఈనాడు- హైదరాబాద్‌: క్రెడిట్‌ కార్డు రుణ పరిమితి రూ.45 వేలు. కార్డుదారు ఏకంగా రూ.41.69 లక్షలు వాడుకున్నాడు. ఇంకో వ్యక్తి క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.90 వేలుంటే.. రూ.26.85 లక్షలు లాగేశాడు. బ్యాంకు సిబ్బందికి అంతుబట్టక సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. గచ్చిబౌలిలోని ఓ బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు క్రెడిట్‌ కార్డులు తీసుకున్నారు. వీరు కార్డుల పరిమితికి మించి రూ.68.55 లక్షలు వాడుకున్నారు. వాస్తవానికి రెండు కార్డుల రుణ పరిమితి రూ.1.35 లక్షలే. బ్యాంకు సిబ్బంది ఈ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. కార్డుదారులను సంప్రదించేందుకు సిబ్బంది ప్రయత్నించగా, ముందుఇచ్చిన చిరునామాలో అందుబాటులో లేరు. బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts