SIIMA: సైమా 2022.. ఈ సారి పోటీ పడనున్న చిత్రాలివే

‘పుష్ప’ హవా.. ఏకంగా 12 కేటగిరిల్లో నామినేట్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌‌: దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా అవార్డుల (SIIMA) ప్రదానోత్సవం వచ్చే నెల 10, 11 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో.. సైమా వేదికగా తలపడనున్న అగ్ర నటీనటుల చిత్రాల జాబితా బుధవారం విడుదలైంది. గతేడాది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన చిత్రాల్లో నామినేషన్స్‌లోకి వెళ్లిన సినిమాలు.. ఎన్ని విభాగాల్లో అవి పోటీ పడనున్నాయో తెలియజేశారు. ఇక, తెలుగులోకి వచ్చేసరికి.. ‘పుష్ప’ (PUSHPA), ‘అఖండ’ (Akanda), ‘ఉప్పెన’ (Uppena), ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) ఎక్కువ విభాగాల్లో నామినేటైనట్లు ప్రకటించారు. అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ 12 కేటగిరిల్లో అత్యధికంగా నామినేట్‌ కాగా, బాలయ్య నటించిన ‘అఖండ’ 10 విభాగాల్లో నామినేటై రెండో స్థానంలో ఉంది.

తెలుగు
పుష్ప ది రైజ్‌ (అల్లు అర్జున్) : 12 
అఖండ (బాలకృష్ణ) : 10
జాతిరత్నాలు (నవీన్‌ పొలిశెట్టి) :  8  
ఉప్పెన (వైష్ణవ్‌ తేజ్‌) : 8

తమిళం
కర్ణన్‌ (ధనుష్‌) : 10
డాక్టర్ (శివ కార్తికేయన్‌) ‌: 9
మాస్టర్‌ (విజయ్‌) : 7
తలైవి (కంగనా రనౌత్‌) : 7

మలయాళం
మిన్నల్‌ మురళీ (టోవినో థామస్‌) : 10
కురుప్ (దుల్కర్‌ సల్మాన్‌) ‌: 8
మాలిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) : 6
జోజీ (ఫహద్‌ ఫాజిల్‌) : 6 

కన్నడ
రాబర్ట్‌ (దర్శన్‌) : 10
గరుడ గమన వృషభ వాహన (రాజ్‌ బి.శెట్టి) :  8
యువరత్న (పునీత్‌ రాజ్‌కుమార్‌) :  7  









మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని