Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు

హైదరాబాద్‌: సినీనటుడు నాజర్‌ స్వల్పంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్‌ సమయంలో మెట్లు దిగుతుండగా కాలు జారి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కన్ను కింద కణతి భాగంలో స్వల్పగాయాలయ్యాయి. నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలో ఉన్న పోలీస్‌ అకాడమీ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళ సినిమాకు సంబంధించిన ఓటీటీ షూటింగ్‌ను ఇవాళ పోలీస్‌ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించారు. సాయంత్రం 4గంల సమయంలో నాజర్‌ గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం నాజర్‌ ఇంటికి వెళ్లిపోయారు.


మరిన్ని

ap-districts
ts-districts