
ఇండోనేషియా విషాదాన్ని తలపించిన ఘటనలెన్నో.. రోమ్‌లో అప్పుడు 20వేల మంది మృతి!
ఇంటర్నెట్‌డెస్క్:ఇండోనేషియాలోని ఫుట్‌బాల్ మైదానంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 174 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొంటున్నారు. అయితే, గతంలనూ ఇలాంటి విషాద ఘటనలు ఎక్కడెక్కడ చోటు చేసుకున్నాయో ఓసారి పరిశీలిస్తే..
హిల్స్బర్గ్లో ఎంతమందికి గాయపడ్డారో ఇప్పటికీ మిస్టరీనే!
యూకేలోని ఫుట్‌బాల్ మైదానాల్లో జరిగిన ప్రమాదాల్లో కెల్లా హిల్స్‌బర్గ్ ఘటన చాలా భయంకరమైనది. ఎంతమందికి గాయాలయ్యాయో ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు. దాదాపు 30 ఏళ్లపాటు ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణ చేపట్టింది. అది 1989, ఏప్రిల్ 15. హిల్స్‌బర్గ్ వేదికగా లివర్‌పూల్-నాటింగ్‌హాం జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పరిమితికి మించి ప్రేక్షకులు మైదానానికి వచ్చేశారు. సరిపడా చోటు లేకపోవడంతో వారంతా మ్యాచ్ నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 96 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 766 మందికి తీవ్రంగా గాయాలైనట్లు అంచనా. ఈ ఘటనకు గుర్తు చేసుకుంటూ లివర్‌పూల్ జట్టు ఆటగాళ్లు ఇప్పటికీ వారి జర్సీ కాలర్‌పై 96 నెంబర్‌ను ముద్రించుకుంటారు.
ఈస్టడో నేసియోనల్ మైదానం..328 మంది మృతి
అది 1964, మే 24. పెరూలోని లైమా నగరంలో గల ఈస్టడో నేసియోనల్ ఫుట్‌బాల్ మైదానంలో అర్జెంటీనా-పెరూ మధ్య ఒలింపిక్స్ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ చివరి దశకు వచ్చింది. ఈ లోగా ఓ గోల్ వివాదాస్పదమైంది. ఒక్కసారిగా పెరు దేశానికి చెందిన అభిమానులంతా మైదానంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించడంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రధాన మార్గాలన్నీ మూసివేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 328 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇబ్రాక్స్ మైదానంలో రెండు సార్లు తొక్కిసలాట
స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్ నగరం ఇబ్రాక్స్ మైదానంలో రెండుసార్లు తొక్కిసలాట చోటు చేసుకుంది. తొలుత 1902, ఏప్రిల్ 5న స్టాండ్ కూలిపోవడంతో 25 మంది బలికాగా.. దాదాపు 600 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 1972లో రేంజర్స్, క్రాస్ టౌన్ రైవల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 66 మంది మృతి చెందగా.. 140 మందికి గాయాలయ్యాయి.
మాస్కోలో 340మంది బలి!
అది 1982, అక్టోబరు 20. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేన్(యూఈఎఫ్ఏ) ఆధ్వర్యంలో డచ్ క్లబ్-స్పార్టక్ మాస్కో జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ చివర్లో ప్రేక్షకుల్లో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దాదాపు 7 ఏళ్ల వరకు సోవియట్ ప్రభుత్వం దాచిపెట్టింది. కానీ, ఈ తొక్కిసలాటలో 340 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కొందరు చెబుతుంటారు.
ఘనాలో 127 మంది..!
ఘనా దేశ రాజధాని అక్రాలోని ఒహేనే డిజాన్ క్రీడా మైదానంలో 2001, మే 9న ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలోని రెండు ప్రతిష్ఠాత్మక జట్లయిన అక్రా హార్ట్స్, అసంటే కొటోకొ జట్ల మధ్య ఓ లీగ్ మ్యాచ్ జరిగింది. ఉన్నట్లుండి ప్రేక్షకులు ఒక్కసారిగా మైదానంలోకి బాటిళ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. లిమాలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా తప్పించుకునే క్రమంలో తొక్కిసలాటతో ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 127 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి.
దశరథ్ రంగస్థల మైదానం..కాఠ్మాండు
అసియా ఖండంలోని ఫుట్‌బాల్ మైదానాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇది అతి భయంకరమైనది. 1988, మార్చి 12న నేపాల్, బంగ్లాదేశ్ ఫుట్‌బాల్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా వడగండ్ల వాన కుమ్మరించింది.దీంతో ప్రేక్షకుల గ్యాలరీలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో 93 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఇవేకాకుండా, టర్కీలోని అటాటుర్క్ స్టేడియంలో 1967లో జరిగిన ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రసెల్స్‌లోని హైసెల్ మైదానంలో 1985లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా 600 మంది గాయపడ్డారు.
రోమ్‌లో 20 వేల మంది మృతి!
మైదానాల్లో తొక్కిసలాటలు జరగడం ఇప్పుడు కొత్తేం కాదు. కీ.శ 27లో రోమ్ సమీపంలోని ఫిడేనియాలోని ఓ మైదానంలో జరిగిన ప్రమాదంలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు. గ్లాడిటోరియల్ క్రీడల సందర్భంగా చెక్క థియేటర్ కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత క్రీ.శ 140లో రోమ్‌లో ఓ చెక్క స్టాండు కూలిపోవడంతో 1100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది.
మైదానాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో జరిగిన తొక్కిసలాటల్లో అత్యధికంగా మరణాలు చోటుచేసుకున్న ఘటనలు..
* సెప్టెంబర్ 24, 2015- సౌదీ హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అత్యధికంగా 2411 ముస్లిం యాత్రికులు చనిపోయారు.
* 1990 జులైలోనూ అక్కడ 1426 మంది, 2006 జనవరిలో 345 మంది, 2004 ఫిబ్రవరిలో 251 మంది, 1998 ఏప్రిల్‌లో 118 మంది మృత్యువాతపడ్డారు.
* మే 23, 1994 - మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గొవారీ (Gowari stampede) కమ్యూనిటీ చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 114 మంది ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయాలపాలయ్యారు.
* ఫిబ్రవరి 20, 2003- అమెరికా రోడె ఐల్యాండ్‌లోని వార్విక్ నగరంలోని నైట్ క్లబ్ వేదికపై ఏర్పాటు చేసిన టపాసులతో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో 100 మంది చనిపోగా.. 200 మంది గాయాలపాలయ్యారు.
* జనవరి 25, 2005- మహారాష్ట్రలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
* ఆగస్టు 31, 2005- బాగ్దాద్‌లో ఓ మతపరమైన ఊరేగింపు జరుగుతోన్న సమయంలో బ్రిడ్జ్ కుప్పుకూలిపోయింది. ఆ ఘటనలో 640 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
* సెప్టెంబర్ 30, 2008- రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 168 మంది చనిపోగా..100 మంది గాయాలపాలయ్యారు.
* నవంబర్ 22, 2010- కాంబోడియా రాజధానిలో ఓ పండుగ వేళ జరిగిన ఘర్షణల్లో 340 మంది ప్రాణాలు కోల్పోయారు.
* ఏప్రిల్ 30, 2021-ఇజ్రాయెల్‌లో మౌంట్ మెరాన్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 45 మంది మృత్యువాతపడ్డారు.
మరిన్ని
Apple job: యాపిల్‌లో ఉద్యోగానికి ఈ నాలుగు లక్షణాలూ ఉండాల్సిందేనట!
Surrogate Ads: ‘ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రదర్శించొద్దు’: కేంద్రం ఆదేశం
Crime news: 2 బైకులను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరి మృతి
Offer letters: ఫ్రెషర్లకు టెక్ సంస్థల షాక్.. ఆఫర్ లెటర్లు వెనక్కి!
Freebies: ఉచితాలు ఆందోళనకరం.. పరిమితి విధించాల్సిందే : ఎస్బీఐ నివేదిక
SmatPhone - Watch: ₹ 10 వేలలోపు ధరలో 5జీ ఫోన్.. నార్డ్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌వాచ్!
Crime News: మైనర్ బాలిక అంగీకరించలేదని వీడియో వైరల్.. నిందితులు అరెస్టు
Dasara: ‘దసరా’ సందడిని ముందే తెచ్చిన నాని.. ‘ధూమ్ ధామ్’తో దుమ్ము రేపుతూ!
Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో సేల్.. 4 రోజుల పాటు డిస్కౌంట్ల పండగ
RTI: నా భర్త జీతం ఎంతో చెప్పండి.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న మహిళ
Chandrababu: పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చిందంటే బాధగా ఉంది: చంద్రబాబు
Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
BillDesk: బిల్‌డెస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పేయూ
Kidnap: బాలుడిని చిలకలూరిపేటలో కిడ్నాప్ చేసి కావలిలో వదిలిపెట్టారు!
Nagavamsi: ఆ స్టార్హీరో సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా: నాగవంశీ
Harish Rao: దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు: మంత్రి హరీశ్
Kishan Reddy: 8 సీట్లతో కేంద్రంలో కేసీఆర్ ఎలా చక్రం తిప్పుతారు?: కిషన్‌రెడ్డి
Prachand: వాయుసేన అమ్ములపొదిలో.. అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు
Bomb Threat: భారత గగనతలంలో.. ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు..!
Alia Bhatt: వాళ్లందరికీ విడివిడిగా అవార్డులు ఇవ్వాలి: ఆలియా భట్
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు: హైదరాబాద్ పోలీసుల సూచన
Gen Z Investments: మీరు ‘జెన్-జీ’నా? భవిష్యత్తు ఆర్థిక భరోసాకు మార్గాలివే!
Naveen Polishetty: ఆ రోజు బాధపడ్డా.. ఇప్పుడు గెస్ట్‌గా వచ్చా: నవీన్ పొలిశెట్టి
Traffic Rules: హైదరాబాద్‌లో అమల్లోకి ‘రోప్’.. స్టాప్‌లైన్ దాటితే..
Adipurush: సూర్యనారాయణ నుంచి ప్రభాస్ వరకు.. ‘జైశ్రీరామ్’ అనిపించిన నటులు
Telugu Movies: ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. థియేటర్-ఓటీటీ దద్దరిల్లిపోతాయ్!
Rajasthan: నా బుజ్జి ఎలుకను దొంగిలించారు సార్.. పోలీసులకు వింత ఫిర్యాదు
అక్కడ అమ్మవారికి కష్టాలు చెప్పుకొని.. చెప్పులు సమర్పిస్తారు!
Mangalyaan: ముగిసిన మంగళయాన్ ప్రస్థానం!.. నిండుకున్న ఇంధనం, బ్యాటరీ
సంచిలో శవం..కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి మాయం: కేరళలో ‘దృశ్యం’ చూపించిన నిందితులు
Ayyannapatrudu: తెదేపా హయాంలో జగన్ బంధువులకూ రుణమాఫీ: అయ్యన్నపాత్రుడు
Anand Mahindra: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న పరీక్ష అది..మీరూ ప్రయత్నిస్తారా?
Social Look: ‘జిన్నా’ సెట్లో పాయల్ సందడి ..కొత్త ఫొటోలు లేవన్న శివాత్మిక!
Shashi Tharoor: కాంగ్రెస్‌లో ఖర్గే మార్పులు తీసుకురాలేరు: శశి థరూర్
Bharat Jodo Yatra: మమ్మల్ని ఎవరూ ఆపలేరు..! జోరు వర్షంలోనూ రాహుల్ ప్రసంగం
Ponniyin Selvan: పాత్రను అర్థం చేసుకోడానికి పుస్తకం మొత్తం చదివాను: త్రిష
Andhra News: చిన్నారికి అరుదైన వ్యాధి.. వైద్యం కోసం రూ.కోటి మంజూరు చేసిన సీఎం జగన్
Arvind Kejriwal: ‘ఐబీ నివేదిక ప్రకారం.. గుజరాత్లో ఆప్‌దే విజయం!’
Lottery: సరుకులు తేవాలంటూ భార్య మెసేజ్.. ఆ వ్యక్తిని వరించిన అదృష్టం
Prashant Kishor: 3500కి.మీ పాదయాత్రను మొదలుపెట్టిన ప్రశాంత్ కిశోర్
Andhra News: అనంతపురం జిల్లాలో భాజపా పోరుయాత్రపై వైకాపా శ్రేణుల దాడి
ఇండోనేషియా విషాదాన్ని తలపించిన ఘటనలెన్నో.. రోమ్‌లో అప్పుడు 20వేల మంది మృతి!
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం శిందే ప్రాణాలకు ముప్పు! భద్రత పెంపు
Hardik Pandya: స్టోక్స్ కంటే హార్దిక్ పాండ్యనే బెస్ట్ ఆల్‌రౌండర్.. కేవలం ఒక్క ఫార్మాట్లోనే!
Telangana News: ఖర్గే పేరు తెరమీదకు రావడంతో భాజపా నేతలకు భయం పట్టుకుంది: భట్టి విక్రమార్క
Bronchitis: ఎడతెరపి లేకుండా దగ్గు వేధిస్తుందా..? యోగా చేసి చూడండి


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్
-
Politics News
Krishna: వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు