Andhra News: అనంతపురం జిల్లాలో భాజపా పోరుయాత్రపై వైకాపా శ్రేణుల దాడి

బొమ్మనహాళ్‌: అనంతపురం జిల్లాలో భాజపా పోరు యాత్ర చేస్తున్న నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. బొమ్మనహాళ్‌ మండలం దేవగిరిలో భాజపా నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ప్రజాపోరు యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలను భాజపా నేతలు ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో వైకాపా శ్రేణులు ఒక్కసారిగా భాజపా నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. పోరుయాత్ర వాహనానికి ఏర్పాటు చేసిన మైక్‌లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న అనంతపురం జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీనివాసులు వెంటనే బొమ్మనహళ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే వైకాపా కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు.


మరిన్ని