Ayyannapatrudu: తెదేపా హయాంలో జగన్‌ బంధువులకూ రుణమాఫీ: అయ్యన్నపాత్రుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో జగన్‌ బంధువులకూ రుణమాఫీ అయ్యిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పోల్చడం మీ తరం కాదని ఆదివారం ట్విటర్‌లో మండిపడ్డారు. తమ పాలనలో తెదేపా వారికీ సంక్షేమ పథకాల లబ్ధి అంందిందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేయడంతో దానికి సమాధానంగా అయ్యన్నపాత్రుడు ట్వీట్‌ చేశారు. ‘వైఎస్‌ మదన్మోహన్‌రెడ్డికి, జగన్‌రెడ్డి వదిన వైఎస్‌ మాధవీలతకు తెదేపా హయాంలో రైతు రుణమాఫీ నగదు పడింది. వైఎస్‌ మధు అకౌంట్‌ నం: 045213100036589లో రెండు విడతలుగా రూ.63వేలు, మూడో విడత రూ.36వేలు, మాధవీలత అకౌంట్‌ నం. 045213100036613లో రెండు విడతలుగా రూ.59,643, మూడో విడతగా రూ.34,081 జమయ్యాయి. వీటిని మర్చిపోతే ఎలా?’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్‌ చేశారు.


మరిన్ని