Alia Bhatt: వాళ్లందరికీ విడివిడిగా అవార్డులు ఇవ్వాలి: ఆలియా భట్‌

సింగపూర్‌: ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలతో అలరించిన ఆలియాభట్‌.. తాజాగా సింగపూర్‌లో ‘టైమ్‌100ఇంఫాక్ట్‌’  పురస్కారాన్ని అందుకుంది. తల్లికాబోతున్న ఆలియా తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

‘‘10 ఏళ్ల క్రితం నేను నటించడం ప్రారంభించినప్పుడు ఎంత కష్టమైన భరించాలని నిర్ణయించుకున్నా. నా కష్టాన్ని ప్రపంచం గుర్తించాలని కోరుకున్నా. భావోద్వేగాలను  పండించడానికి ఎంత కష్టమైనా పడతాను. నా శరీర బరువు, రూపాన్ని కాపాడుకోడానికి కఠినంగా ఉంటాను. కానీ నేను ఫ్రెంచ్‌ఫ్రైస్‌ తినడానికి ‘నో’ చెప్పను. ఎందుకంటే మనం ఒక్కసారి మాత్రమే జీవిస్తాం. అందుకే ఆనందంగా ఉండాలి’’ అని తెలిపింది. ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా భర్త రణ్‌బీర్‌ కపూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నేను వీళ్లందరికీ విడివిడిగా అవార్డులు ఇవ్వాలి. ఇంతకంటే అద్భుతమైన విషయం ఏంటంటే నా ప్రసంగం అంతా విని నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను తంతున్నాడు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించింది అలియా.



మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు