Kishan Reddy: 8 సీట్లతో కేంద్రంలో కేసీఆర్ ఎలా చక్రం తిప్పుతారు?: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: మజ్లిస్‌ బలోపేతం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నెగటివ్‌ ఆటిట్యూడ్‌తో వచ్చే ఏ పార్టీకీ మనుగడ లేదని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందని.. ఆ పార్టీకి మిగిలిన ఏకైన మిత్ర పక్షం మజ్లిస్‌ మాత్రమేనన్నారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో తెరాస నేతలకే తెలియదని ఎద్దేవా చేశారు.

‘‘కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోంది. తెరాస వైఫల్యాల మీద చర్చ జరగొద్దనేది కేసీఆర్‌ ఆలోచన. కవిత కేంద్రమంత్రి, కేటీఆర్‌ తెలంగాణ సీఎం, తాను ప్రధాని అయినట్లు ఫాంహౌస్‌లో ఆయన కలలు కంటున్నారు. పార్లమెంట్‌లో తెరాసకు ఇప్పుడున్న 8 సీట్లతో దేశంలో ఎలా చక్రం తిప్పుతారు?కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయి’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.



మరిన్ని