viral video: సంస్కృతంలో క్రికెట్‌ కామెంటరీ.. వీడియో వైరల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, ఈ ఆటను ఇష్టపడేవారెవరూ వ్యాఖ్యానం లేకుండా క్రికెట్‌ను ఊహించుకోలేరు. సాధారణంగా ఇంగ్లిష్‌ లేదా ఇతర ప్రాంతీయ భాషల్లో క్రికెట్‌ కామెంటరీని విని ఉంటారు. కానీ ఎప్పుడైనా సంస్కృతంలో విన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కొందరు కుర్రాళ్లు కలిసి క్రికెట్‌ ఆడుతున్న వీడియోలో ఓ వ్యక్తి గుక్క తిప్పుకోకుండా సంస్కృతంలో కామెంటరీని వినిపిస్తున్నాడు.  మాతృభాషనే నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో సంస్కృతంలో సదరు వ్యక్తి ఇంత పట్టు సాధించడం, ఇలా అనర్గళంగా మాట్లాడుతుండటంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.  ఇలాంటి కామెంటరీ వినడం ఇదే మొదటిసారి అంటూ నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సంస్కృతంలో కామెంటరీ చెప్పించాలి’ అంటూ ఓ నెటిజన్‌ కోరాడు.  ‘ప్రతి ఒక్కరూ తమ మాతృ భాషలో ఇలా మాట్లాడగలిగితే ఎంత బాగుంటుంది’ అని మరొకరు కామెంట్‌  చేశారు. ఈ వీడియోకు ఒక్క రోజులో దాదాపు 30లక్షల వీక్షణలు, 12 వేల లైకులు వచ్చాయి. 



మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు