God Father: మోహన్‌ లాల్‌ 50 నిమిషాలు.. చిరంజీవి 2 గంటలు!

హైదరాబాద్‌: సుమారు 2:50 గం.ల నిడివి ఉన్న మలయాళ సినిమా ‘లూసీఫర్‌’లో హీరో మోహన్‌ లాల్‌ 50 నిమిషాలు కనిపిస్తారని, ఆ సినిమా రీమేక్‌గా రూపొందిన ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) 2 గంటలపాటు తెరపై సందడి చేస్తారని దర్శకుడు మోహన్‌ రాజా తెలిపారు. చిరంజీవి హీరోగా ఆయన తెరకెక్కించిన ‘గాడ్‌ ఫాదర్‌’ అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మోహన్‌రాజా విలేకరులతో మాట్లాడారు.

‘‘గాడ్‌ ఫాదర్‌’ చిరంజీవికి ఇమేజ్‌కు తగ్గ కథ. ఈ కంటెంట్‌కు సరిపోయే స్థాయి ఉన్న హీరోలు ఇండియాలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ‘లూసీఫర్‌’లో లేని ఓ కొత్త కోణం గాడ్ ఫాదర్‌లో ఉంటుంది. మాతృక చిత్ర కథకు నాదైన శైలిలో స్క్రీన్‌ప్లే జత చేశా. అదే సర్‌ప్రైజ్‌ చేస్తుంది. మలయాళ చిత్రంలో కనిపించని పది పాత్రలు ఇందులో కనిపిస్తాయి’’ అని మోహన్‌రాజా సినిమా విశేషాలు పంచుకున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.



మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు