Tirumala: భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీవారి రథోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వేడుకగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుక పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగారు. భక్తుల జయజయధ్వానాలు.. గోవిందనామ స్మరణల మధ్య మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు.


మరిన్ని