Adipurush: ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌కు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి వార్నింగ్‌!

భోపాల్‌: ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్‌’ టీజర్‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. వీఎఫ్‌ఎక్స్‌ పేలవంగా ఉందని, కార్టూన్‌ సినిమాను తలపిస్తోందంటూ ప్రభాస్‌ అభిమానులు సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తాజాగా ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌ ఓంరౌత్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. హిందూ దేవతలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ సీన్లను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రభాస్‌ నటించిన ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ ఇటీవల విడుదలైన నేపథ్యంలో నరోత్తమ్‌ మిశ్రా విలేకరులతో మాట్లాడారు.

‘‘ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ టీజర్‌ చూశా. అందులో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. టీజర్‌లో హిందూ దేవతల వస్త్రాధారణ భిన్నంగా ఉంది. హనుమంతుడు లెదర్‌ వేసుకున్నట్లుగా చూపించారు. మిగిలిన దేవతల వస్త్రధారణ కూడా గ్రంథాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా ఉంది. మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సీన్లను తొలగించాలని ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నా’’ అని నరోత్తమ్‌ మిశ్రా పేర్కొన్నారు. ఒకవేళ ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. నరోత్తమ్‌ మిశ్రా ఇలా వార్నింగ్‌ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జులై లీనా మణిమేఖలై రూపొందించిన ‘కాళీ’ పోస్టర్‌పైనా ఆయన ఇదే తరహాలో స్పందించారు. కాగా, రామాయాణ ఇతివృత్తం ఆధారంగా వస్తున్న ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా, కృతి సనన్‌ సీత పాత్రలో కనిపిస్తున్నారు.



మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు