సోషల్‌మీడియా స్నేహం.. మహిళపై ముగ్గురు వైద్యుల అత్యాచారం!

బస్తీ(యూపీ): సామాజిక మాధ్యమాల్లో స్నేహం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీలో స్నేహం పేరిట ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు మరో ఇద్దరితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెతో స్నేహం ఏర్పరచుకున్న ఆ వైద్యుడు ఆమెను తన ఆస్పత్రికి రావాలని ఆహ్వానించాడు. దీంతో ఆమె ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. నిందితుడు అక్కడి నుంచి తన హాస్టల్‌ గదికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులైన తన ఇద్దరు సహచరులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ ప్రయివేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోందని.. ఈ ఘటనపై గత నెల 27న ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేసి వైద్యుడిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు