Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు..

దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. దీపావళి కానుకగా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ఇటీవల ప్రకటించిన ఆ సంస్థ.. ట్రయల్‌ బేసిస్‌పై దసరా నుంచే ఈ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ట్రయల్‌ బేసిస్‌ ఆధారంగా అక్టోబర్‌ 5నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ప్రపంచకప్‌నకు దూరం.. స్పందించిన బుమ్రా!

టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వెన్ను గాయం కారణంగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ మధ్యలోనే నిష్క్రమించిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. తాజాగా ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Hyderabad: బైక్‌పై వెళ్లి 4 గ్రనేడ్లు తెచ్చిన జాహెద్‌..

హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడులకు పాకిస్థాన్‌లో పథక రచన చేసినట్లు గుర్తించారు. ఉగ్ర కుట్ర కేసు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్‌ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్‌కు ఫరాతుల్లా ఘోరి పంపినట్టు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. Boy friend For Hire: నవ్వులు పూయిస్తున్న ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్’ ట్రైలర్‌..!

విశ్వాంత్‌, మాళవిక జంటగా సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం ఈ రోజు విడుదల చేసింది. అమ్మాయిలను చూస్తే భయపడే అబ్బాయిగా విశ్వాంత్‌ నటన, ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మునుగోడు ఉప ఎన్నిక.. నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం

ఈనెల 11న మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యూహంపై గాంధీభవన్‌లో దాదాపు 3గంటలకు పైగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఉప ఎన్నిక ప్రచారం, తెరాస, భాజపాలను ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై నేతలు చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

 6. నీళ్లకు బదులు యాసిడ్‌.. రెస్టారంట్‌ మేనేజర్‌ అరెస్ట్‌!

పుట్టిన రోజు వేడుకలకు వాటర్‌ బాటిళ్ల(Water Bottles)లో నీళ్లకు బదులు యాసిడ్‌(Acid) అందజేసిన ఘటన పాకిస్థాన్‌(Pakistan)లోని ఓ రెస్టారంట్‌లో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఓ బాలుడికి కాలిన గాయాలు కాగా, మరొక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెస్టారంట్‌(Restaurant) మేనేజర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. అమ్మాయిలూ భళా.. ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయం

ఆసియా కప్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు అదరగొట్టేస్తోంది. వరుసగా మూడో విజయం సాధించి గ్రూప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మీద 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకొంది.  దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. క్రిటికల్‌ ఇల్‌నెస్ బీమా అవ‌స‌ర‌మేనా?

బీమా అన‌గానే ఎక్కువ‌ మందికి జీవిత బీమా, సాధార‌ణ ఆరోగ్య బీమా గుర్తుకు వ‌స్తాయి. కొన్నేళ్ల నుంచి ఆరోగ్య బీమాపై  ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న బాగా పెరిగింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా దీనిపై ఎక్కువ క‌స‌ర‌త్తే చేస్తున్నాయి. అనేక ప్ర‌వేటు బీమా కంపెనీలు ఈ ఆరోగ్య బీమా సేవ‌ల‌ను విరివిగా అందిస్తున్నాయి. బీమా కంపెనీలు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ (క్లిష్టమైన అనారోగ్యాల) కవర్ కూడా అందిస్తున్నాయి. అసలు ఈ కవర్ ఏంటి? ఇందువల్ల ఉపయోగం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. Missile Fire: ఉత్తర కొరియా దూకుడు.. జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం!

కొన్నిరోజులుగా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు మీదున్న ఉత్తర కొరియా(North Korea).. మంగళవారం సైతం ఓ బాలిస్టిక్‌ మిసైల్‌(Ballistic Missile)ను ప్రయోగించింది. అయితే, దీన్ని జపాన్‌(Japan) మీదుగా ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కొరియా(South Korea), జపాన్ కోస్ట్‌ గార్డ్‌లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. Uttarakhand: బాబోయ్‌.. కొండలెక్కడం అంత ఈజీ కాదు..!

ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది పర్వతారోహణకు వెళ్లినట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించిన విపత్తు ప్రతిస్పందన సహాయక బృందాలు 8 మందిని రక్షించాయి. మిగతావారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్వతారోహకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది? వాటి నుంచి ఎలా బయటపడాలో  తెలుసుకుందామా? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని