Longer: నా ముందు బాగుండేవారు.. కానీ తప్పించే కుట్ర చేస్తారని అనుకోలేదు: లాంగర్‌

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్‌ సిరీస్‌ను 4-0 తేడాతో దక్కించుకోవడంతోపాటు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా సాధించడంలో మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచకప్ 2021 టోర్నీ అనంతరం కోచ్‌ పదవి నుంచి లాంగర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. పలువురు ఆసీస్‌ క్రికెటర్లు కోరుకోవడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని అప్పట్లోనే వివరణ ఇచ్చింది. తాజాగా జస్టిన్‌ లాంగర్ కొందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించాడు. 

‘‘నేను కోచ్‌గా ఉన్నప్పుడు జట్టులోని ఆటగాళ్లందరూ నా ముందు మాత్రం చాలా బాగుండేవారు. అయితే నన్ను తొలగించడానికే పేపర్లు సిద్ధం చేస్తున్నారని పలువురు చెప్పినా నేను నమ్మలేకపోయా. చాలా మంది పాత్రికేయులు ‘సోర్స్‌’ అనే పదం వాడుతుంటారు కదా.. కానీ నేను మాత్రం ఇలాంటి వారిని ‘పిరికిపందలు’ అని అంటాను. ఎందుకంటే గొడ్డలి తీసుకొని అవతలివారితో కలిసి నరికేసి.. మన ముందుకు వచ్చినప్పుడు ఏమీ చెప్పకుండా ఉంటారు. కేవలం తమ అజెండాను అమలు చేసేందుకు కొన్ని లీక్‌లు ఇస్తుంటారు. అలా చేయడం నాకసహ్యం. అయితే జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆనందించా. అప్పుడు మేం నంబర్‌ వన్‌ జట్టుగా మారాం. కోచ్‌గా నన్ను తప్పించడమే నా జీవితంలో కఠినమైన విషయం’’ అని తెలిపాడు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు