Gautham Karthik: ఐ లవ్ యూ చెబితే మంజిమ వెంటనే ఓకే చెప్పలేదు: గౌతమ్ కార్తిక్

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో నాలుగు రోజుల్లో తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకోనున్నారు నటుడు గౌతమ్‌ కార్తిక్ (Gautham Karthik)‌, నటి మంజిమా మోహన్ (Manjima Mohan)‌. ఈ నేపథ్యంలో వీరిద్దరూ చెన్నైలోని విలేకరులను కలిసి తమ ప్రేమకథను బయటపెట్టారు. అయితే, తమది మరీ అంత గొప్ప ప్రేమ కథేమీ కాదని చెప్పారు.

‘‘జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడే మనం మంచి మనిషిగా ఎదుగుతాం’ అని నాన్న నాకెప్పుడూ చెబుతూ ఉండేవారు. అలా నా జీవితానికి సరైన వ్యక్తి మంజిమ. తను అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన వ్యక్తి. ధైర్యవంతురాలు. నేనెప్పుడు నిరాశ, ఆందోళనకు గురైనా.. తనే నా వెంట ఉండేది. దేవరట్టంసినిమా సమయంలో మేమిద్దరం మంచి స్నేహితులుగా మరాం. ఏడాది పాటు స్నేహితులుగానే ఉన్నాం. ఆమెతో రిలేషన్‌ కొనసాగించాలని అనిపించింది. వెంటనే ఆమెకు ప్రపోజ్‌ చేశా. రెండ్రోజుల వరకు తను ఎస్‌ చెప్పలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఇటీవల నిర్ణయించుకున్నాం. మా నిర్ణయంతో ఇరు కుటుంబంలోని పెద్దలు ఆనందంగా ఉన్నారు’’ అని గౌతమ్‌ పేర్కొన్నారు.

నవంబర్‌ 28న చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో తమ పెళ్లి జరగనున్నట్లు ఈ జోడీ తెలిపింది. తెలుగులో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో మంజిమ ఇక్కడివారికి చేరువయ్యారు. మరోవైపు ఒకప్పటి ప్రముఖ నటుడు కార్తిక్‌ కుమారుడిగా గౌతమ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘కడలి’తో తెలుగు వారికి పరిచయమయ్యారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు