Raghurama: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్‌ నోటీసులు

హైదరాబాద్‌: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో విచారణకు హాజరుకావాలని సిట్‌ పేర్కొంది. ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించింది. దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్‌ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ కేసులో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, భారతీయ ధర్మజనసేన చీఫ్‌ తుషార్‌, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. విచారణ రావాల్సిందిగా కోరినా.. శ్రీనివాస్‌ మినహా మిగిలిన ముగ్గురు హాజరవ్వలేదు. అనంతరం నందకుమార్‌ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్‌కుమార్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. తాజాగా రఘురామకృష్ణరాజు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు