Virat Kohli: జిమ్‌లో విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లకు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ,కేఎల్‌ రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. అనంతరం డిసెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆ జట్టుతో 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనతో రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చేరనున్నారు. దీంతో బంగ్లాదేశ్‌ పర్యటన కోసం ఈ ఆటగాళ్లు ఇప్పటి నుంచే జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమటోడ్చుతున్నారు. 

ఈ నేపథ్యంలో కోహ్లీ ఒక వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. అందులో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతూ, బరువులు ఎత్తుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ కూడా జిమ్‌లో బరువులెత్తుతూ కష్టపడుతున్నాడు. హిట్‌మ్యాన్‌ జిమ్‌లో ఉన్న ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్ పర్యటన విషయానికొస్తే.. డిసెంబరు 4న ఢాకా వేదికగా తొలి వన్డే, అదే వేదికలో ఏడో తేదీన రెండో వన్డే, 10న చిట్టగాంగ్ వేదికగా మూడో వన్డే జరగనున్నాయి. డిసెంబరు 14-18 మధ్య తొలి టెస్టు, అదే నెల 22- 26 మధ్య రెండో టెస్టు ఆడనుంది.




మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు