Crime News: పోలీసుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి

కటక్: ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో గురువారం వేకువజామున పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కంద్ర బట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. దీంతో ఎస్ఓజి, డీవీఎఫ్‌ బలగాలు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించాయి. ఆపరేషన్ కొనసాగుతుండగా గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు.. పోలీసుల రాకను గమనించి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరుపగా మావోయిస్టులు చల్లాచెదురు అయ్యారు. కాల్పుల అనంతరం ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. స్థానిక ఐజి, జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు